బీట్ రూట్ తో ఇలా చేస్తే చాలు ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా, కాంతివంతంగా మెరుస్తుంది
Beetroot Face Glow Tips : బీట్ రూట్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే బీట్ రూట్ లో ఎన్నో బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ విషయం మనలో కొంతమందికి మాత్రమే తెలుసు. బీట్ రూట్ లో ఉన్న పోషకాలు మృత కణాలను తొలగించి కొత్త కణాలను నిర్మిస్తాయి. అలాగే పిగ్మెంటేషన్ తొలగించటానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది.
ఒక చిన్న బీట్ రూట్ ని తీసుకొని పై తొక్క తీసి తురుముకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక కప్పు బాదం ఆయిల్, తురిమిన బీట్ రూట్ వేసి పది నిమిషాలు మరిగించాలి. అప్పుడు బీట్ రూట్ లో ఉన్న పోషకాలు నూనెలోకి చేరతాయి. ఈ నూనెను వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను ముఖానికి రాసి సున్నితంగా మసాజ్ చేయాలి.
పది నిమిషాలు అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయటం వలన ముఖానికి అవసరమైన తేమ అంది ముఖం కాంతివంతంగా తెల్లగా మెరుస్తుంది. అలాగే కంటి కింద నల్లని వలయాలను కూడా తగ్గిస్తుంది. బాదం నూనె చర్మానికి తేమను అందించి పొడి చర్మం లేకుండా చేస్తుంది.
ఈ నూనెను ఒక్కసారి చేసుకుంటే నెలరోజుల పాటు వాడుకోవచ్చు. బీట్ రూట్, బాదం నూనె రెండు చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయ పడతాయి. ఈ చిట్కా ఫాలో అయ్యి అందమైన ముఖాన్ని సొంతం చేసుకొండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/