ఈ సింపుల్ చిట్కా ఫాలో అయితే మీ జుట్టు 5 రేట్లు వేగంగా పెరుగుతుంది
cloves Hair Fall Tips : జుట్టు రాలే సమస్య అనేది ఈ రోజుల్లో సర్వ సాధారణం అయ్యిపోయింది. జుట్టు రాలే సమస్య అనేది ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. లవంగాలు జుట్టుకి సంబందించిన సమస్యలను తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
లవంగాలు అంటే మనలో చాలా మందికి ఒక మసాలా దినుసుగా మాత్రమే తెలుసు. లవంగాలలో ఉన్న యూజినాల్ అనే సమ్మేళనం జుట్టు కుదుళ్లలోకి చొచ్చుకొని జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. అలాగే తెల్లని జుట్టును నల్లగా మార్చుతుంది. లవంగాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ తల మీద చర్మానికి రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది.
పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి రెండు గ్లాసుల నీటిని పోసి కాస్త వేడెక్కాక రెండు స్పూన్ల లవంగాలను వేసి ఒక గ్లాస్ నీరు అయ్యేవరకు మరిగించాలి. ఈ నీటిని రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం నీటిని వడకట్టి స్ప్రే సీసాలో పోసి జుట్టు మొత్తం కవర్ అయ్యేలా స్ప్రే చేసి అరగంట అలా వదిలేసి కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/