కొబ్బరి నూనెలో కలిపి రాస్తే జుట్టు రాలకుండా చాలా వేగంగా పెరుగుతుంది
Hair Growth Tips : జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే మనలో చాలా మంది వేలకు వేలు ఖర్చు చేసి రకరకాల నూనెలను వాడుతూ ఉంటారు. అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్దంగా తయారుచేసుకున్న నూనెను వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా.పొడవుగా పెరుగుతుంది.
ఒక పాన్ లో 50 Ml కొబ్బరి నూనెను పోసి దానిలో 10 యాలకులను కచ్చా పచ్చాగా దంచి వేసి యాలకులు వేగే వరకు మరిగించాలి. ఈ నూనె కొంచెం చల్లారాక వడకట్టి ఒక స్పూన్ ఆముదం వేసి బాగా కలపాలి. ఈ నూనెను ఎక్కువ మొత్తంలో తయారుచేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఈ నూనెను వారంలో రెండు సార్లు రాసుకోవాలి.
జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉన్నవారు రోజు రాసుకొనే నూనెకు బదులు ఈ నూనెను వాడవచ్చు. ఈ నూనెను జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు రాసి పది నిమిషాల పాటు మసాజ్ చేస్తే తల మీద చర్మంలో రక్తప్రసరణ బాగా సాగి జుట్టు కుదుళ్లు ఉత్తేజితం అయ్యి జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/