మెంతులలో ఈ నూనెను కలిపి రాస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది
Hair Fall Tips In telugu : ఈ మధ్య కాలంలో జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువ అయ్యిపోయింది. జుట్టు రాలటానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. మనలో చాలా మంది జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే మార్కెట్ దొరికే నూనెలను వాడుతూ ఉంటారు. అలా కాకుండా మనం ఇంటిలో తయారుచేసుకున్న నూనెను వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సమస్య నుంచి బయట పడవచ్చు.
ఒక బౌల్ లో రెండు స్పూన్ల కొబ్బరి నూనె,ఒక స్పూన్ ఆముదం,ఒక స్పూన్ బాదం నూనె, ఒక స్పూన్ మెంతి పొడి వేసి బాగా కలిపి డబుల్ బాయిలింగ్ పద్దతిలో వేడి చేసి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి అరగంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.
మెంతులను పొడిగా తయారుచేసుకోవాలి. మెంతి పొడి మార్కెట్ లో దొరుకుతుంది. మెంతులలో ఉన్న లక్షణాలు జుట్టు కుదుళ్లను బలపరచటమే కాకుండా చుండ్రు వంటి సమస్యలు లేకుండా తల మీద చర్మం తేమగా ఉండేలా చేస్తుంది. జుట్టు రాలటానికి చుండ్రు కూడా ఒక కారణం. ఆముదం కూడా జుట్టు ఒత్తుగా పెరగతనికి సహాయపడుతుంది.
సహజసిద్దంగా దొరికే పదార్ధాలతో ఇలా నూనెను తయారుచేసుకొని వాడితే మంచి ఫలితాలు చాలా తొందరగా వస్తాయి. ఇక వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/