కలబందలో ఇది కలిపి రాస్తే ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మెరిసిపోతుంది
Alovera And Lemon Face Pack : ప్రతి ఒక్కరు ముఖం అందంగా తెల్లగా కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు. అది సహజం కూడా. అయితే దాని కోసం ఎన్నో రకాల క్రీమ్స్ వాడిన పెద్దగా ఫలితం ఉండదు. ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే ఎంతటి నల్లటి ముఖం అయినా తెల్లగా మెరిసిపోతుంది. ఈ చిట్కాకు కేవలం మూడు ఇంగ్రిడియన్స్ సరిపోతాయి. అవి కూడా మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే.
కలబందను అలోవెరా అని కూడా పిలుస్తారు. కలబందలో ఉన్న ఔషధ గుణాలు,పోషకాలు అనేక ఆరోగ్య సమస్యల పరిష్కారానికి సహాయపడుతుంది. కలబందలో విటమిన్ ఏ,బి,బి2,బి4,బి6, బి12,విటమిన్ సి,విటమిన్ E వంట ఎన్నో పోషకాలు ఉన్నాయి. కలబంద చర్మ సంరక్షణ,జుట్టు సంరక్షణలో బాగా సహాయాపడుతుంది.
కలబందలో ఉండే విటమిన్ E,విటమిన్ సి చర్మ రంద్రాలను శుభ్రం చేసి చర్మానికి అవసరమైన తేమను అందించటంలో సహాయపడి చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. చర్మం నల్లగా,నిస్తేజంగా,కాంతి విహీనంగా మారినప్పుడు ఇప్పుడు చెప్పే చిట్కాను పాటిస్తే చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా,అందంగా తెల్లగా మారుతుంది.
నిమ్మలో ఉన్న బ్లీచింగ్ లక్షణాలు చర్మంపై పేరుకుపోయిన నలుపును తొలగించటంలో సహాయపడుతుంది. పంచదార సహజమైన ఎక్స్ ఫ్లోట్ గా పనిచేసి ముఖంపై మృతకణాలను తొలగించి కాంతివంతంగా మార్చుతుంది. ఒక బౌల్ లో అర చెక్క నిమ్మరసం తీసుకోవాలి. దానిలో కొంచెం పంచదార వేసి బాగా కలపాలి.
కలబందపై ఉన్న పొట్టును తీసేయాలి. మనకి మంచి ఫలితాలు తొందరగా రావాలంటే మార్కెట్ లో దొరికే అలోవెరా జెల్ కాకుండా ఇలా ఫ్రెష్ గా ఉన్న కలబందను ఉపయోగించాలి. ఈ మిశ్రమంలో కలబందను డీప్ చేయాలి. కలబందకు నిమ్మరసం,పంచదార బాగా పట్టేలా డీప్ చేసి ముఖానికి రాయాలి. ఈ చిట్కాను చేయటానికి ముందు ముఖాన్ని శుభ్రంగా కడగాలి.
నిమ్మరసం,పంచదారలో డీప్ చేసిన కలబందను ముఖం మీద రెండు నిమిషాల పాటు మర్దన చేయాలి. ఈ విధంగా చేయటం వలన ముఖంలోని మలినాలు,మృత కణాలు తొలగిపోతాయి. వీటిల్లో ఉండే పోషకాలు ముఖాన్ని కాంతివంతంగా చేస్తాయి. ముఖం బాగా ఆరాక సాధారణమైన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే ముఖం మీద ఉన్న మృత కణాలు అన్ని తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/