గ్రీన్ టీలో ఇది కలిపి రాస్తే జుట్టు రాలకుండా 100 % పొడవుగా,ఒత్తుగా పెరుగుతుంది
Hair Fall And Growth tips In telugu : జుట్టు రాలే సమస్య కారణంగా మనలో చాలా మంది చాలా ఎక్కువగా ఆందోళన పడుతూ ఉంటారు. ఇలా ఆందోళన పడితే ఇంకా ఎక్కువ జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. ఈ సమస్య ప్రారంభం కాగానే కంగారు పడి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు.
అలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా సహజసిద్దంగా దొరికే ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సమస్య నుండి బయట పడవచ్చు. ఈ చిట్కా చేయటం చాలా సులువు. కాస్త సమయాన్ని కేటాయించి ఓపికగా చేసుకుంటే సరిపోతుంది.
ఒక బౌల్ లో ఒక స్పూన్ కొబ్బరి నూనె,అరస్పూన్ ఆముదం వేసి బాగా కలిపి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి వేడి నీటిలో ముంచిన టవల్ చుట్టుకొని పది నిమిషాల తర్వాత టవల్ తీసేసి 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత హెయిర్ టానిక్ తయారుచేసుకొని స్ప్రే చేసుకోవాలి.
హెయిర్ టానిక్ కోసం పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి అరగ్లాసు నీటిని పోసి ఒక స్పూన్ గ్రీన్ టీ పొడి వేసి మరిగించి ఆ నీటిని ఒక బౌల్ లోకి వడకట్టాలి. ఈ గ్రీన్ టీ నీరు కాస్త చల్లారాక ఒక స్పూన్ ఆలోవెరా జెల్, రెండు vitamin e capsule లోని ఆయిల్ వేసి బాగా కలిపి ఒక స్ప్రే బాటిల్ లో పోసి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి.
ఆ తర్వాత 5 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా చేయటం వలన తలలో రక్తప్రసరణ బాగా జరిగి జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది. అలాగే చుండ్రు సమస్య కూడా తొలగిపోతుంది. వారంలో రెండు సార్లు ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య నుండి బయట పడవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/