జుట్టును వేగంగా పెంచే జెల్…ఇది వాడితే జుట్టు రాలకుండా దృడంగా,ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది
Hair Growth Tips In telugu : ఈ మధ్య కాలంలో మారిన పరిస్థితుల దృష్ట్యా చాలామంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు రాలిన ప్రదేశంలో జుట్టు రాకపోవటంతో చాలా నిరాశకు గురి అవుతున్నారు. ఒత్తిడి, పోషకాహార లోపం, పొల్యూషన్ వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలిపోతుంది.
దీని కోసం మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. ఈ రెమిడీ కోసం ముందుగా పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి అరగ్లాసు నీటిని పోసి ఒక స్పూన్ గ్రీన్ టీ పొడి వేసి మూడు నిమిషాలు మరిగించి వడగట్టాలి.
ఒక బౌల్లో గ్రీన్ టీ డికాషన్, మూడు స్పూన్ల ఆలోవెరా జెల్, 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ లోని ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ జెల్ ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టేలాగా అప్లై చేయాలి. ఒక గంట అలా వదిలేయాలి. ఆ తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే జుట్టు కుదుళ్లు స్ట్రాంగ్ గా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది.
జుట్టుకు అవసరమైన పోషకాలు అందుతాయి. జుట్టుకి సంబందించిన అన్నీ రకాల సమస్యలను తగ్గిస్తుంది. గ్రీన్ టీలో B విటమిన్ సమృద్దిగా ఉంటుంది. ఇది మీ జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. జుట్టును మృదువుగా, ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగడానికి తోడ్పడుతుంది. జుట్టు పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది.
విటమిన్ E ఆయిల్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. అలాగే జుట్టును మెరిసేలా చేస్తాయి. కలబంద జెల్ కూడా జుట్టు తేమగా ఉండేలా చేయటమే కాకుండా జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. చుండ్రు సమస్య లేకుండా చేయటంలో కూడా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/