Health Tips: షుగర్ ఉన్నవాళ్లు.. ఈ మూడు పండ్లను తింటే ఏమి అవుతుందో తెలుసా…?
Fruits For Diabetic:ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసులోనే మధుమేహం అనేది వచ్చేస్తుంది. వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే షుగర్ ఉన్నవారు కొన్ని పండ్లను తినకుండా ఉంటేనే మంచిది. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఆరోగ్యం బాగుండాలంటే మంచి ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. మన ఆరోగ్యం విషయంలో ఆహారం కీలకమైన పాత్రను పోషిస్తుంది.
సీజన్లో దొరికే పండ్లను తింటే వాటిలోని పోషకాలు మన శరీరానికి అంది శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. అయితే పండ్లలో సహజ సిద్ధమైన చక్కెరలు ఎక్కువగా ఉండటం వలన పండ్లు తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు చాలా వేగంగా పెరిగిపోతాయి.
అందువల్ల మధుమేహం ఉన్నవారు తీసుకునే పండ్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కొన్ని పండ్లకు చాలా దూరంగా ఉండాలి. షుగర్ ఉన్నవారికి గ్లైసెమిక్ ఇండెక్స్ 55 కంటే తక్కువ ఉన్న ఆహారం మంచిది. కాబట్టి ఇప్పుడు చెప్పే పండ్లకు దూరంగా ఉంటేనే మంచిది. అంజీర్ లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. Anjeer తింటే అలసట, నీరసం తగ్గి తక్షణ శక్తి వస్తుంది. అయితే అంజీర్ లో ఉన్న పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. అందువల్ల షుగర్ ఉన్నవారు anjeer కి దూరంగా ఉంటేనే మంచిది.
ద్రాక్షలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అలాగే విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అయితే ద్రాక్షలో ఎక్కువ మొత్తంలో చక్కెర ఉండటం వలన డయాబెటిస్ ఉన్నవారు ద్రాక్షకు దూరంగా ఉంటేనే మంచిది. ద్రాక్షను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు చాలా వేగంగా పెరిగిపోతాయి. ఒక కప్పు ద్రాక్ష పండ్లలో దాదాపుగా 23 గ్రాముల చక్కెర ఉంటుంది.
పండ్లలో రారాజు అయినా మామిడి పండు అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. మామిడిపండులో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. అలాగే చక్కెర పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది. మామిడికాయలో దాదాపుగా 46 గ్రాముల చక్కెర ఉంటుంది. అందువల్ల మామిడిపండు తింటే వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. అంతే కాకుండా బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది.
కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు పండ్లను తినాలని కోరిక కలిగి ఉంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించి డాక్టర్ సూచన ప్రకారం తింటే మంచిది. డయాబెటిస్ ఉన్నవారు వారి ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టి తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News
https://www.chaipakodi.com/