Hair Fall:ఈ ఆరు ఉంటే చాలు.. హెయిర్ ఫాల్ ఎంత తీవ్రంగా ఉన్న సులభంగా చెక్ పెట్టవచ్చు
Hair Fall Home Remedies: సాదారణంగా కొంత మంది జుట్టుకి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన ఎదగదు. దాంతో చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అయితే జుట్టు ఎదగక పోవడానికి పోషకాల కొరత, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు వంటి ఎన్నో కారణాలు ఉంటాయి. జుట్టుకి ప్రోటీన్, ఐరన్, విటమిన్ ఇ వంటి పోషకాలు అందితే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
ఇలాంటి ఆహారాలను తీసుకుంటూ ఇప్పుడు చెప్పే హెయిర్ ప్యాక్( Hair Pack ) వారానికి ఒకసారి వేస్తే జుట్టు పెరగటానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి పొయ్యి మీద పెట్టి కాస్త వేడి అయ్యాక రెండు స్పూన్ల అవిసే గింజలు, నాలుగు లవంగాలు వేసి ఉడికించాలి.
జెల్లీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత పల్చటి వస్త్రం సహాయంతో జెల్ ను సపరేట్ చేసుకోవాలి. ఈ జెల్ లో ఒక స్పూన్ కరివేపాకు పౌడర్( Curry leaves Powder ), ఒక స్పూన్ ఆమ్లా పౌడర్, ఒక స్పూన్ మందారం పౌడర్( Hibiscus Powder ), ఒక స్పూన్ ఆముదం వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి గంట తర్వాత మైల్డ్ షాంపూ తో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే జుట్టు పెరుగుదల బాగుంటుంది. జుట్టు రాలే సమస్య,తెల్లజుట్టు సమస్య తొలగి జుట్టు నల్లగా మెరుస్తుంది.
ఈ చిట్కాలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ చాలా సులభంగా లభ్యం అవుతాయి. అలాగే వీటిలో ఉన్న పోషకాలు జుట్టుకి సంబందించిన సమస్యలను తగ్గించటంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కరివేపాకులో ఉన్న పోషకాలు జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది.
ఉసిరి పొడి మార్కెట్ లో లభ్యం అవుతుంది. లేదంటే సీజన్ లో ఉసిరికాయలను ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టి పొడిగా చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. మందార పొడిని కూడా ఇంటిలోనే తయారుచేసుకోవచ్చు. కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయ్యి ఒత్తైన జుట్టును పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News
https://www.chaipakodi.com/