Healthhealth tips in telugu

Food Before Water:ఆహారం తీసుకొనే ముందు వాటర్ ఎక్కువగా తీసుకుంటే ఇన్ని లాభాలా..?

Drinking Water :మంచి నీటిని ఎక్కువగా తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అందుకే పోషకాహార నిపుణులు కూడా నీరు ఎక్కువగా తాగమని చెప్పుతూ ఉంటారు. నీరు తాగే విషయంలో మనలో చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.

ఆహారం తీసుకునేముందు ఎక్కువ నీళ్లు తాగాలి. ఎక్కువ నీరు తీసుకోవడం ద్వారా ఆహారం తీసుకునే మోతాదు తగ్గుతుంది. క్యారెట్లు, కీరదోస ముక్కలు వంటివి తినడం ద్వారా ఒబిసిటీ దూరం చేసుకోవచ్చు. జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు ఆఫీసులో ఉంచుకోవాలి. ఏమీ తినకుండా వచ్చిన రోజు వాటిని తింటే శక్తి లభిస్తుంది. లేదంటే ఆకలి వల్ల మెదడు పని తీరు సన్నగిల్లుతుంది.

పనిమీద ఏకాగ్రత ఉండదు. రోజంతా ఆ ప్రభావం ఉంటుంది.అల్పాహారం తీసుకోనప్పుడు రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయుల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఇది దీర్ఘకాలం కొనసాగితే టైప్2 మధుమేహం, అధిక రక్తపోటు వంటి వాటి బారిన పడే ప్రమాదం ఉంది.

ఇంట్లో సమయానికి తినకపోవడం వల్ల బయటి ఆహారం మీదకు మనసు లాగుతుంది. అలా బయట తిండికి అలవాటు పడితే త్వరగా బరువు పెరిగే ప్రమాదం ఉందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News