Hair Fall:జుట్టు ఎక్కువగా రాలుతోందా? ఈ సూపర్ ఫుడ్స్ తింటే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది
Foods For Hair:మనలో చాలా మంది జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరగాలని కోరుకుంటారు. దాని కోసం చాలా రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. అయితే కొన్ని ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది.
ఆకుకూరలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఆకుకూరల్లో ఐరన్ మరియు జింక్, అలాగే బీటా కెరోటిన్, ఫోలేట్ మరియు విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన జుట్టు పెళుసుదనాన్ని మరియు చిట్లే సమస్యను తగ్గిస్తుంది.
జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో ఉల్లిపాయలు కూడా చాలా బాగా సహాయపడుతుంది. ఉల్లిపాయలో జింక్ మరియు బయోటిన్ ఉండుట వలన కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి బలమైన, ఒత్తైన జుట్టును పొందే ప్రక్రియను వేగవంతం చేస్తుందని నిపుణులు చెప్పుతున్నారు. ఉల్లిరసాన్ని జుట్టుకు రాయవచ్చు…లేదంటే ఆహారంలో బాగంగా చేసుకోవచ్చు.
పెరుగు జుట్టు సమస్యలకు ఒక వరం అని చెప్పవచ్చు. పెరుగులో ప్రోబయోటిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, విటమిన్ B5 సమృద్దిగా ఉండుట వలన జుట్టు పల్చబడటం మరియు రాలడాన్ని ఎదుర్కోవడంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.
నట్స్ రెగ్యులర్ గా తీసుకుంటే…నట్స్ లో ఉండే విటమిన్ E జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అలాగే బాదం నూనె వంటి వాటిని జుట్టుకి రాస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. రోజుకి 5 బాదం పప్పులను తినవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News
https://www.chaipakodi.com/