Kitchenvantalu

Velluli charu: వెల్లుల్లి చారు ఇలా చేస్తే వేడి వేడి అన్నంలోకి పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది

Velluli charu: సాలిడ్ ఫుడ్స్ తిని తిని, ఒక్కోసారి జారుగా, నాలుగు ముద్దలు తినాలనిపిస్తుంది. అలాంటి వారి కోసం వెల్లుల్లితో, చారు తయారి చూద్దాం.

కావాల్సిన పదార్ధాలు
మిరియాలు – 1 టీ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
వెల్లుల్లి – 35 గ్రాములు
పచ్చిమిర్చి – 4
కరివేపాకు – 2 కాడలు
పసుపు – 1/4టీస్పూన్
ఉప్పు – తగినంత
టమాటో ముక్కలు – 1 కప్పు
చింతపండు రసం – 1/2కప్పు
నూనె – 1.5 టీ స్పన్
నీళ్లు – 800ML

తాళింపు కోసం..
నూనె – 1 టేబుల్ స్పూన్
ఆవాలు – 1 టీ స్పూన్
జీలకర్ర – 1/4టీ స్పూన్
ఎండుమిర్చి -2
ఇంగువ – రెండు చిటికెలు
కరివేపాకు – 2 రెబ్బలు
కొత్తిమీర – చిన్న కట్ట
పొట్టుతో దంచిన వెల్లుల్లి – 5

తయారీ విధానం
1.ముందుగా ఒక రోల్ లోకి మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసుకుని, కచ్చా పచ్చాగా దంచి పక్కన ఉంచుకోండి.
2. ఇప్పుడు స్టవ్ పాన్ పెట్టుకుని, నూనె వెడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు రెబ్బలు, దంచిన వెల్లుల్లి, మిర్యాల ముద్ద, వేసి రంగు ఆరే దాకా వేపుకోవాలి.
3. వేగిన వెల్లుల్లిలో టమాటో ముక్కలు వేసి, పసుపు, ఉప్పు వేసి రెండు నిముషాలు ఉడికించాలి.

4. అందులోకి చింతపుండు పులుసు పోసి, రెండు మూడు పొంగులు వచ్చే వరకు మరగనివ్వాలి.
5. పులుసు మరిగిన తర్వాత, నీళ్లు పోసుకుని, హై ఫ్లైమ్ పై పచ్చిమిర్చి, మెత్తపడేవరకు, మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
6. ఇప్పుడు తాళింపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి, నూనె వేడి చేసి, తాళింపులు వేసుకుని, పొట్టుతో దంచిన వెల్లుల్లిని, ఎర్రగా వేపుకుని, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీర వేసుకుని, తాళింపును రసంలోకి కలుపుకోవాలి.
7. అంతే వేడి వేడి వెల్లుల్లి రసం రెడీ..
Click Here To Follow Chaipakodi On Google News