Kitchenvantalu

Catering Style Coriander Rice:కేటరింగ్ స్టైల్ కొత్తిమీర అన్న౦ ఇలా చేస్తే లంచ్,టిఫిన్ బాక్స్ లోకి సూపర్ ఉంటుంది

Catering Style Coriander Rice: కొత్తిమీర ఆరోగ్యానికి, అరుగుదలకు, రుచికి, ఎంత మంచిదో, తెల్సిన విషయమే. ఆఖర్లో అందంగా, వంటకాలపై, అలంకరించుకునే, కొత్తిమీర, రూచే వేరు. పచ్చి కొత్తమీరతో రైస్ మిక్స్ చేసి చూడండి.

కావాల్సిన పదార్ధాలు
కొత్తిమీర పేస్ట్ కోసం..
కొత్తిమీర – 150 గ్రాములు
పూదీనా – 75 గ్రాములు
అల్లం – 1 ఇంచ్
వెల్లుల్లి – 12
ఉల్లిపాయ – 1
పసుపు – కొద్దిగా

రైస్ కోసం..
బాస్మతి బియ్యం – 2 కప్పులు
నూనె -50ML
నెయ్యి – 1 టేబుల్ స్పూన్
జీడిపప్పు – 10 నుంచి 15
బిర్యాని ఆకు – 2
దాల్చిన చెక్క – 1 ఇంచ్
లవంగాలు – 4 లేదా 5
నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం
1.ఒక మిక్సీజార్ లోకి కొత్తిమీర పేస్ట్ కోసం తీసుకున్న పదార్ధాలను వేసి కొద్దిగా నీళ్లు యాడ్ చేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి.
2. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ను పల్చని బట్టలోకి వేసుకుని, రసాన్ని పిండుకోవాలి.
3. బాస్మతీ బియ్యంలో కొత్తిమీర రసం 4 కప్పులు, ఉప్పు, వేసి, 1 గంట పాటు నానపెట్టుకోవాలి.
4. బాండీ పెట్టుకుని, అందులోకి నెయ్యి వేసి, జీడిపప్పులను వేపుకోవాలి.

5. జీడిపప్పు వేగాక, బిర్యాని ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి, కాసేపు వేపుకోవాలి.
6. కొత్తిమీర రసంలో నానిన బియ్యం నీళ్లతో సహా అందులోకి వేసుకుని, కలుపుకుని, హై ఫ్లేమ్ పై ఉడకనివ్వాలి.
7. అన్నం కాస్త్ ఉడుకు పట్టిన తర్వాత, స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకుని, మూత పెట్టి, కాస్త దగ్గరపడనివ్వాలి.
8. 80 శాతం ఉడికిన అన్నంలోకి , నిమ్మరసం వేసి, మరో 7 లేదా 8 నిముషాలు ఉడికించి, స్టవ్ ఆఫ్ చేసుకుని 20 నిముషాలు పక్కన ఉంచాలి.
9. అంతే వేడి వేడి కొత్తి మీర రైస్ తయారైనట్లే..
Click Here To Follow Chaipakodi On Google News