Healthhealth tips in telugu

Home Remedies for Headache: తలనొప్పిని సులభంగా తగ్గించే 4 ఇంటి నివారణలు!

Home Remedies for Headache:తలనొప్పి చిన్న సమస్య అయినా ఒక్కోసారి విపరీతమైన భరించలేనంత నొప్పి ఉంటుంది. నిద్రలేమి, ఒత్తిడి వంటి కారణాలతో కూడా తలనొప్పి వస్తుంది. తల నొప్పిగా ఉంటే ఏ పని చేయలేం.

అలాగే పని మీద దృష్టి పట్టడం కూడా కష్టమే. అందుకే తల నొప్పి ప్రారంభంకాగానే ప్రతి ఒక్కరూ టాబ్లెట్ వేసుకుంటారు. అయితే ఎక్కువగా టాబ్లెట్లు వేసుకుంటే ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇంటి చిట్కాల ద్వారా తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

ఆ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసి తాగితే తలనొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది.తల నొప్పిని తగ్గించడంలో వెల్లుల్లి కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు ఒక స్కూల్ వెల్లుల్లి రసాన్ని తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది.

శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. కాబట్టి సాధ్యమైనంతవరకు నీటిని తాగుతూ ఉండాలి.

బాదం పప్పు, వాల్ నట్స్ వంటి నట్స్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.ఈ చిట్కాలు పాటించండి. అయినా సరే తల నొప్పి తగ్గకపోతే అప్పుడు టాబ్లెట్స్ వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News