Street Style Gobi Fried Rice:బండి మీద చేసే గోబీ ఫ్రైడ్ రైస్ ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు
Street Style Gobi Fried Rice: తాజా గోబీ పువ్వులో చైనీస్, సాస్ జోడించి, స్పైసీ అండ్ టేస్టీ, స్ట్రీట్ ఫుడ్ స్టైల్,. గోబీ ఫ్రైడ్ రైస్ చేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
కాలీ ఫ్లవర్ ఫ్రై కోసం..
కాలీ ఫ్లవర్ ముక్కలు – 250 గ్రాములు
ఉప్పు – తగినంత
కారం – 1 టీ స్పూన్
గరం మసాలా – 1/2టీ స్పూన్
జీలకర్ర పొడి – 1/2టీ స్పూన్
రెడ్ ఫుడ్ కలర్ – 2 చిటికెలు
కరివేపాకు తరుగు – కొద్దిగా
కొత్తిమీర తరుగు – కొద్దిగా
నూనె – ఫ్రైకి సరిపడా
ఫ్రైడ్ రైస్ కోసం..
కారం – 1 టీ స్పూన్
నూనె – 3 టేబుల్ స్పూన్స్
ఎండు మిర్చి – 2
కరివేపాకు – 1 రెబ్బ
వెల్లుల్లి – 2 టీ స్పూన్స్
ఉల్లిపాయ తరుగు – 1/4కప్పు
పచ్చిమిర్చి తరుగు – 1 టేబుల్ స్పూన్
వండిన అన్నం – 1 కప్పు
మిరియాల పొడి – 1 టీ స్పూన్
ఉప్పు – తగినంత
అజినోమోటో – 1/2టీ స్పూన్
డార్క్ సోయా సాస్ – 1/2టీస్పూన్
నిమ్మరసం – 1 టీ స్పూన్
వెనిగర్ – 1 టీ స్పూన్
ఉల్లి కాడల తరుగు – కొద్దిగా
తయారీ విధానం
1.కాలీ ఫ్లవర్ కోటింగ్ కోసం, పదార్ధాలు అన్ని వేసి, నీళ్లతో చిక్కని ముద్దగా చేసుకోవాలి.
2.ఆ చిక్కని పేస్ట్ లో, కాలీ ఫ్లవర్ ముక్కలు వేసి, నెమ్మదిగా కోట్ చేసుకోవాలి.
3. కోట్ చేసుకున్న కాలీ ఫ్లవర్ ముక్కలను మరిగే నూనెలో వేసి, మీడియం ఫ్లేమ్ పై గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి.
4. లైట్ కలర్ రాగానే, హై ఫ్లేమ్ లోకి పెట్టుకుని, కరకరలాడే లాగా వేపుకోవాలి.
5. ఇప్పుడు స్టవ్ పై వేరొక ప్యాన్ పెట్టుకుని, నూనె వేసుకుని, అందులోకి ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసి వేపుకోవాలి.
6. వెల్లుల్లి వేగిన తర్వాత ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి మరి కాసేపు వేపుకోవాలి.
7. మెత్తపడిన ఉల్లిపాయల్లోకి, ఉడికించిన అన్నం వేసి, ఫ్రై కోసం పెట్టుకున్న పదార్ధాలు అన్ని వేసి, హై ఫ్లేమ్ పైన, టాస్ చేసుకోవాలి.
8. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేముందు, ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసి హై ఫ్లైమ్ పై ఒకసారి టాస్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
9. అంతే .. చివరగా కొత్తిమీర జల్లుకుని వేడి వేడిగా సెర్వ్ చేసుకోవడమే.
Click Here To Follow Chaipakodi On Google News