Kitchen

Kitchen Hacks:ఇల్లాలికి ఉపయోగపడే కొన్ని సులభమైన వంటింటి చిట్కాలు

Kitchen Tips in telugu: వంట గదిలో పనులు త్వరగా అవ్వాలంటే కొన్ని చిట్కాలను ఫాలో అవ్వాలి. అప్పుడే పనులను త్వరగా చేయటం అవుతుంది. ఆ చిట్కాలను తెలుసుకుందాం.

పెరుగు పులుపు లేకుండా కమ్మగా ఉండాలంటే.. తోడుపెట్టిన పాలల్లో చిన్న కొబ్బరి ముక్కవేస్తే పెరుగు కమ్మగా ఉంటుంది.

తేనె ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే.. సీసాలో రెండుమూడు మిరియాలు వేస్తే ఎక్కువకాలం నిల్వ ఉంటుంది. చీమలుకూడా పట్టవు.

దుంపలను ఉప్పు కలిపిన నీటిలో ఓ పావుగంట నానబెట్టి ఆ తర్వాత ఉడికించండి. త్వరగా ఉడుకుతాయి.

దోసకాయ ముక్కలు క్రష్‌ చేసి కిచెన్‌ చుట్టు ప్రక్కల ఉంచారంటే, బొద్దింకలు మాయం అవుతాయి. ముఖ్యంగా వంటగదిలో బొద్దింకల బెడద ఎక్కువగా ఉంటుంది.

నిమ్మకాయ రసం పిండివేశాక, ఆ నిమ్మడిప్పల్ని పారవేయకుండా వాటితో ప్లాస్టిక్‌ సామానును రబ్‌ చేయండి మురికి పోయి అది మెరిసిపోవటాన్ని మీరు గుర్తించగలుగుతారు.

నిమ్మకాయల్ని తడిబట్టలో చుట్టి పాలిథిన్‌ కవర్లో ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
Click Here To Follow Chaipakodi On Google News