Instant Buttermilk Powder : ఇన్‌స్టంట్ మజ్జిగ పొడి.. దీన్ని మజ్జిగలో కలిపి తాగితే.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం..
Instant Spicy Powder for Buttermilk: శరీరానికి చలువ చేసే మజ్జిక మనం తీసుకునే ఫుడ్ లో భాగమై పోవాలి. వట్టి మజ్జిక కాకుండా అందులోకి కాసిన్ని మిరియాలు, శొంఠి ఘాటు తగిలిస్తే మరింత ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ఆ మజ్జిక పొడిని ఇన్ స్టంట్ గా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.
కావాల్సిన పధార్ధాలు
ధనియాలు- ½ కప్పు
జీలకర్ర- 1/52 కప్పు
శొంఠి- 8 గ్రాములు
మిరియాలు- 1.5 టీ స్పూన్
వాము – 1 టేబుల్ స్పూన్
కరివేపాకు – 7 రెబ్బలు
ఉప్పు – 1.5 టీ స్పూన్
ఇంగువ – 1 టీ స్పూన్
పెరుగు- 1 కప్పు
నీళ్లు- 750 ml
తయారీ విధానం
1.ముందుగా శొంఠిని దంచి పక్కన పెట్టుకోవాలి.
2.కడిగి నీడలో ఆరబెట్టిన కరివేపాకును సన్నని సెగ పై తడి పోయే వరకు వేపుకోని పక్కనపెట్టుకోవాలి.
3.ధనియాలు,జీలకర్ర ను కూడ దోరగా వేయించుకోవాలి.
4.వేగిన దినుసుల్లో దంచిన శొంఠి,మిరియాలు,వాము వేసి సన్నని సెగ పై వేపుకోవాలి.
5.వేగిన దినుసులను ప్లేట్ లో వేసుకొని ఉప్పు,ఇంగువ వేసి బాగా కలిపి పూర్తిగా చల్లారనివ్వాలి.
6.చల్లారాక మిక్సి జార్ లో వేసుకొని మెత్తని పొడి చేసుకోవాలి.
7.గ్రైండ్ చేసుకున్న మెత్తని పొడిని జల్లెడ పట్టుకోని మెత్తని ఈ మజ్జిక పొడిని మజ్జికలో కలుపుకోని నీళ్లు కలుపుకొని సర్వ్ చేసుకోవడమే.
8.అంతే రుచి కరమైన,ఆరోగ్య కరమైన మజ్జిక పొడి తయారైనట్టే..
Click Here To Follow Chaipakodi On Google News