Teeth Problems: ఈ చిట్కాలు ఫాలో అయితే మీ దంతాలు మెరవడం గ్యారంటీ..!
Cause of Teeth Problems:ముఖంలో మరో అందమైన భాగం అందమైన పలువరుస ఎంతో అందంగా ఉంటుంది. అయితే పలువరుస అందంగా ఉన్నా, పళ్ళు పచ్చగా గార పట్టి ఉంటే నలుగురిలో హాయిగా నవ్వలేము. అందుకే, ఎప్పుడూ పళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలి. చాలా మంది వారి దంత సంరక్షణ కోసం రెగ్యులర్ గా డెంటిస్ట్ ను కలుస్తుంటారు.
రోజులో రెండు సార్లు బ్రెష్ చేసుకోవడం చేస్తుంటారు. అందుకే వారి దంతాలు తెల్లగా మిళమిళలాడుతూ ఆరోగ్యం ఉంటాయి. అయితే మరొకొందరికి ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్న వారి దంతాలు అంత అందంగా కనబడవు, పసుపుపచ్చగా కనబడుతుంటాయి.
మరి ఈ సమస్యకు పరిష్కారం ఇంట్లో ఉండే పదార్థాలతోనే కేవలం 3 నిమిషాల్లోనే మీ దంతాలను తెల్లగా మారేలా చేయవచ్చు. పచ్చగా ఉన్న దంతాలను తెల్లగా కనిపించేలా చేసేందుకు కేవలం రెండు పదార్థాలను తీసుకుంటే చాలు. అవే బేకింగ్ సోడా, నిమ్మరసం. ఒక చిన్నపాటి బౌల్‌లో ఒక స్పూన్ బేకింగ్ సోడాను తీసుకోవాలి. దానికి సగం నిమ్మకాయ నుంచి తీసిన రసాన్ని కొద్ది కొద్దిగా కలపాలి.
చివరకు బేకింగ్ సోడా నిమ్మరసంలో పారదర్శకంగా కరిగి ఓ ద్రావణంలా తయారవుతుంది. ఈ ద్రావణంలో కొద్ది భాగాన్ని చేతి వేలిపై తీసుకుని దాంతో దంతాలపై బ్రష్ చేసినట్టు చేయాలి. అనంతరం నీటితో నోటిని పుక్కిలించాలి. అంతే, క్షణాల్లోనే దంతాలు తెల్లగా మారుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News