Kitchenvantalu

Venna Pattu:తమిళనాడు స్పెషల్ ప్రసాదం ఒక సారి చేసి చూడండి.. చాలా బాగుంటుంది

Venna Pattu: పండగలకి,వ్రతాలకి,పూజలకి,శుభాకార్యం ఏదైనా పరమాన్నం స్పెషల్ గా ఉండాల్సిందే. సేమియా ,రవ్వకేసరి,కాకుండా బియ్యం తో చేసుకునే వెన్న పుట్టు తమిళనాడు స్పెషల్ ప్రసాదాన్ని తయారు చేసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
నానబెట్టిన బియ్యం – ½ కప్పు
నీళ్లు – 2 కప్పులు
బెల్లం – 1 కప్పు
పచ్చి శనగపప్పు – 2 టేబుల్ స్పూన్స్
పచ్చికొబ్బరి తురుము – ¼ కప్పు
యాలకుల పొడి – 1 టీ స్పూన్
నెయ్యి – 2 టీ స్పూన్స్

తయారీ విధానం
1.నానబెట్టిన బియ్యంలో అరకప్పు నీళ్లు పోసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి.
2.బియ్యం పేస్ట్ ని నీళ్లలో కలిపి పక్కన పెట్టుకోవాలి.
3.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని అందులో నెయ్యి వేసి కరిగించి నానబెట్టిన శనగ పప్పు,బియ్యం కలిపిన నీళ్లు పోసి బియ్యం చిక్కని పేస్ట్ అయ్యేదాక కలుపుతూ ఉడకనివ్వాలి.

4.బియ్యం ఉడికి దగ్గరపడ్డాక బెల్లం,యాలకుల పొడి వేసి మరికాసేపు ఉడకనివ్వాలి.
5.పదిహేను నిమిషాల పాటు పుట్టు చేతికి అట్టకుండ దగ్గరపడేదాక ఉడకనివ్వాలి.
6.చివరగా పచ్చి కొబ్బరి తురుము వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కమ్మని వెన్నపుట్టు రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News