Sweet corn thotakura garelu:చిటికెలో తయారయ్యే స్వీట్ కార్న్ తోటకూర గారెలు.. రుచి చూస్తే వదిలిపెట్టరు
Sweet corn thotakura garelu:పెసరగారెలు, మినపగారెలు కామన్.స్పెషల్ గా స్వీట్ కార్న్ తో, తోట కూర కలిపి గారెలు చేసి చూడండి.
కావాల్సిన పదార్ధాలు
లేత స్వీట్ క్నార్ గింజలు – 2.5 కప్పులు
తోట కూర ఆకులు -2.5 కప్పులు
అల్లం – ½ఇంచ్
వెల్లుల్లి – 6 నుంచి 7
ఉప్పు – తగినంత
జీలకర్ర – 1 టీ స్పూన్
సోంపు – ½ టీస్పూన్
ఉల్లిపాయ – 1/2కప్పు
బియ్యం పిండి – 1/4కప్పు
పచ్చిమిర్చి – 5
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం
1.ఒక మిక్సీ జార్లోకి, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, సోంపు, ఉప్పు, మొక్కజొన్న గింజలు, వేసి, బరకగా నీళ్లు కలపకుండా గ్రైండ్ చేసుకోవాలి.
2. గ్రైండ్ చేసుకున్న పిండిలో ఉల్లిపాయ తరుగు, తోటకూర ఆకులు, బియ్యం పిండి వేసి కలుపుకోవాలి.
3. తడి చేత్తో , పిండి ముద్దను నెమ్మదిగా తట్టి, గారెలు మాదిరిగా వత్తుకుని, మరిగే నూనెలో వేసుకోవాలి.
4. మీడియం ఫ్లేమ్ పై రెండు వైపులా ఎర్రగా కాల్చుకుని, తీసుకోవాలి.
Click Here To Follow Chaipakodi On Google News