white Hair Turn Black:ఉల్లిరసంలో కలపి రాసుకోండి చాలు.. తెల్లజుట్టు నల్లగా మారిపోవడం ఖాయం..!
White Hair Tips :ఏ సమస్య అయినా కాస్త ఓపికగా చేస్తే ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా తెల్లజుట్టు సమస్యకు ఇంటి చిట్కాలను ప్రయత్నం చేయవచ్చు.
మారిన జీవనశైలి కారణంగా జుట్టుకి సంబందించిన ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలను ఇంటి చిట్కాల ద్వారా చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ మధ్య కాలంలో జుట్టు రాలే సమస్య, తెల్లజుట్టు సమస్య అనేవి చాలా మందిని వేదనకు గురి చేస్తున్నాయి.
చాలా చిన్న వయస్సులోనే ఈ సమస్యలు రావటంతో చాలా కంగారు పడి మార్కెట్ లో రకరాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉన్నారు. అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్దమైన పదార్ధాలతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. కాస్త ఓపికగా ఈ చిట్కాను పాటిస్తే చాలా మంచి పలితాన్ని పొందవచ్చు.
ఈ చిట్కా కోసం రెండు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. గుప్పెడు కరివేపాకు ఆకులను శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి రసం తీసుకోవాలి. కరివేపాకు పేస్ట్ లో ఉల్లిపాయ రసం వేసి బాగా కలిపి పావుగంట అలా వదిలేయలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించాలి.
అరగంట అయ్యాక రెగ్యులర్ గా వాడే షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు నల్లగా మారటమే కాకుండా జుట్టు రాలే సమస్య,చుండ్రు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. కరివేపాకు సహజసిద్ధంగా మెలనిన్ వర్ణద్రవ్యాన్ని మెరుగు పరచటంలో సహాయపడి జుట్టు ముదురు రంగులోకి మార్చి నల్లగా మారేలా చేస్తుంది.
ఉల్లిపాయలో సల్ఫర్ ఉంటుంది. సల్ఫర్ జుట్టుకు చాలా మేలు చేస్తుంది. జుట్టు రాలకుండా జుట్టు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. అలాగే తెల్లజుట్టు సమస్యలను పరిష్కరిస్తుంది. తెల్ల జుట్టు నల్లగా మారటానికి సహాయపడుతుంది. జుట్టుకు మంచి టోనర్ గా పనిచేస్తుంది. .తెల్లజుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాలు, తెల్లజుట్టు తక్కువగా ఉంటే తక్కువ వారాల సమయం పడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News
https://www.chaipakodi.com/