Beauty Tips

Hair Care Tips:పట్టులాంటి మెరిసే జట్టు సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? కలబందతో ఇలా ట్రై చేయండి..

Alovera And Coffee Hair PAck:ఈ మధ్యకాలంలో జుట్టు రాలే సమస్య ఎక్కువగా వస్తుంది. తీసుకునే ఆహారం, వాతావరణంలో కలిగే మార్పులు వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయింది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే రకరకాల నూనెలను., షాంపూలను వాడేస్తూ ఉంటారు.

దీని కోసం వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా జుట్టు రాలే సమస్య, చుండ్రు వంటి జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ రెమిడీ చేయటం చాలా సులువు. కాస్త ఓపిక,సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

ఒక బౌల్ లో మూడు స్పూన్ల కలబంద జెల్, మూడు స్పూన్ల అల్లం రసం, ఒక స్పూన్ కాఫీ పొడి,రెండు స్పూన్ల కొబ్బరి నూనె వేసి అన్నీ ఇంగ్రిడియన్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించి అరగంట అలా వదిలేయలి. ఆ తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు కుదుళ్లు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరగటమే కాకుండా మృదువుగా మెరుస్తూ ఉంటుంది. అల్లం జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. హెయిర్ రూట్, ఫోలికల్స్‌ను దృఢంగా మారుస్తుంది. అల్లంలో ఉండే అనేక ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు, ఖనిజాలు వెంట్రుకలను బలంగా మారుస్తూ జుట్టు రాలడాన్ని అడ్డుకుంటాయి.

కలబంద జుట్టును మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా కలబందలో ఉండే అనేక విటమిన్లు, మినరల్స్, ఎంజైములు, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు పొడవుగా ,దృఢంగా ఉండేలా చేస్తాయి. కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయ్యి జుట్టుకి సంబందించిన సమస్యల నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News