Saggubiyyam Punugulu:సాయంత్రం వేళ కరకరలాడే.. సగ్గుబియ్యం పునుగులు ఇలా చేస్తే నూనె అసలు పీల్చవు
Saggubiyyam Punugulu: చల్లని వాతావరణంలో ఈవినంగ్ స్నాక్స్ లా, మిరపకాయ బజ్జీలు, పకోడీలే కాదు. అప్పుడప్పుడు, మన ట్రేడీష్నల్ ఫుడ్ ,సగ్గుబియ్యం బోండాలు ట్రై చేయండి.
కావాల్సిన పదార్థాలు
సగ్గుబియ్యం – 3/4కప్పు
పుల్లటి పెరుగు – 1 కప్పు
నీళ్లు – 1/2కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
ఉల్లిపాయ తరుగు – 1/4కప్పు
పచ్చిమిర్చి – 2 టేబుల్ స్పూన్స్
జీలకర్ర – ½ టేబుల్ స్పూన్
బియ్యం – 1/4కప్పు
అల్లం తురుము – ¼ టేబుల్ స్పూన్
కొత్తిమీర కొద్దిగా
తయారీ విధానం
1.సగ్గుబియ్యంలో నీళ్లు, పెరుగు, కలిపి ఐదు గంటలు నానపెట్టుకోవాలి.
2. ఐదు గంటల తర్వాత, నానిన సగ్గుబియ్యం లోకి, మిగిలిన పదార్ధాలు అన్ని వేసి బాగా కలుపుకోవాలి.
3.అవసరం అయితే కొద్దిగా నీళ్లు చిలకరించుకుని, పిండి కాస్త చిక్కగా కలుపుకోవాలి.
4.ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకుని, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, వేడెక్కనివ్వాలి.
5. చేతులు తడి చేసుకుని, పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని పునుగుల మాదిరిగా నూనెలో వేసుకోవాలి.
6.స్టవ్ మీడయం ఫ్లేమ్ పై పెట్టుకుని, తిప్పుతూ, బోండాలను, ఎర్రగా కాల్చుకుని, బయటికి తీసుకోవాలి.
Click Here To Follow Chaipakodi On Google News