Kitchenvantalu

Hyderabad Style Mirchi Bajji: హైద‌రాబాద్ స్పెష‌ల్ మ‌సాలా మిర్చీ బ‌జ్జీ.. నోట్లో వేసుకోగానే రుచి అదిరిపోతుంది..!

Hyderabad Style Mirchi Bajji: ఏ స్ట్రీట్ లో చూసినా, ఈవినింగ్ అయిందంటే చాలు, కనిపించేవి మిర్చి, బజ్జి స్టాల్సే. ఏ స్టాల్స్ కు వెళ్లకుండా, అచ్చం స్ట్రీట్ ఫుడ్ స్టైల్లోనే, మిర్చి బజ్జిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
చింతపండు పేస్ట్ కోసం..
చిక్కని చింతపండు గుజ్జు – 50 గ్రాములు
ఆమ్ చూర్ పొడి – ½ టేబుల్ స్పూన్
ఉప్పు – తగినంత
కారం – 1/2టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి – 1/2టేబుల్ స్పూన్

బజ్జీల కోసం..
శనగపిండి – 1.5కప్పు
నీళ్లు – 1 కప్పు
ఉప్పు – తగినంత
సోడా – 1/4టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
వాము – 1 టేబుల్ స్పూన్
మిర్చీలు – 18
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
చాట్ మసాలా – కొద్దిగా
ఉల్లిపాయ తరుగు- కొద్దిగా

తయారీ విధానం
1.నానపెట్టిన చింతపండు గుజ్జులోకి, పైన చెప్పిన పదార్ధాలు అన్ని, పేస్ట్ గా చేసుకోవాలి.
2. బజ్జిమిరపకాయలు కడిగి, అంచులు కట్ చేసుకోవాలి.
3. తర్వాత మిర్చిని మధ్యకు చీరుకుని, గింజలను తీసి వేయాలి.
4.చింతపుండు గుజ్జుతో చేసుకున్న పేస్ట్ ను, చీల్చిన మిర్చిలో, వేళ్లతో ఫిల్ చేయాలి.
5. ఇప్పుడొక బౌల్ లో శనగపిండి, ఉప్పు, సోడా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నలిపిన వాము వేసుకుని, ఉండలు లేకుండా, చిక్కని ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి.

6.చిక్కగా కలుపుకున్న పిండిని, ఒక గ్లాస్లో పోసుకోవాలి.
7. ఇప్పుడు చింతపుండు పేస్ట్, అప్లై చేసిన, మిర్చిలను, తొడిమపట్టుకుని, గ్లాస్ లో ముంచాలి.
8.మిర్చి అంతటికీ, శనగపిండి పట్టుకున్నాక, తీసి వేడి నూనెలో వేసుకోవాలి.
9.మీడియం ఫ్లేమ్ పై బజ్జీలను, కాల్చుకోవాలి.
10. కాల్చిన మిర్చి బజ్జీలపై , చాట్ మసాలా, ఉల్లిపాయ తరుగు వేసుకుని, సెర్వ్ చేసుకోవడమే.
Click Here To Follow Chaipakodi On Google News