Kitchen Hacks:వర్షాకాలంలో బిస్కెట్స్ మెత్తగా కాకుండా క్రిస్పీగా ఉండాలంటే…
Biscuits and cookies crispy in monsoon:వర్షాకాలంలో బిస్కెట్స్ మెత్తగా అవకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పే చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల బిస్కెట్స్ చాలా తొందరగా మెత్తగా మారిపోతాయి.
బిస్కెట్స్ మెత్తగా ఉంటే తినటానికి కాస్త ఇబ్బందిగాను, కష్టంగానూ ఉంటుంది. ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అయితే బిస్కెట్లు వర్షాకాలంలో కూడా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి.
మనలో చాలామంది బిస్కెట్లను నిలువ చేయడానికి ప్లాస్టిక్ లేదా అల్యూమినియం డబ్బాలను వాడుతూ ఉంటారు. ఇలా వాడటం వలన బిస్కెట్లు తేమను పీల్చుకొని మృదువుగా మారిపోతాయి. వాటి రుచి కూడా మారిపోతుంది.
కాబట్టి బిస్కెట్లను నిలవ చేయడానికి గాలి చొరబడని డబ్బాలను ఉపయోగించాలి. అలాగే బిస్కెట్లు చాలా రోజుల పాటు క్రిస్పీగా ఉంటాయి.టిష్యూ పేపర్లు కూడా బిస్కెట్లను నిల్వ చేయడానికి చాలా బాగా సహాయపడతాయి.
డబ్బాలో బిస్కెట్లను పెట్టే ముందు దాని లోపల రెండు మూడు టిష్యూ పేపర్ లను వేసి ఆ తర్వాత బిస్కెట్లు పెట్టి మరల పైన కూడా టిష్యూ పేపర్లను పెట్టి కప్పి మూత పెడితే చాలా రోజులు పాటు క్రిస్పీగా ఉంటాయి . అలాగే జిప్ పౌచ్ లో కూడా నిల్వ చేయవచ్చు. గాజు సీసాలో బిస్కెట్లను నిలవ చేస్తే వర్షాకాలంలో క్రిస్పీగా ఉంటాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
Click Here To Follow Chaipakodi On Google News
https://www.chaipakodi.com/