Garlic Chili Egg:గుడ్డు వెల్లుల్లి కారం.. ఒక్కసారి రుచి చూస్తే ఫిదా అయిపోతారు
Garlic Chili Egg:చల్లచల్లని వాతవారణంలో,వేడి వేడి అన్నంలోకి కోడిగుడ్డు ఉల్లికారం చేసుకుంటే చాలు. టేస్ట్ లో మరే కూరలు సరిరావు అనిపిస్తది.చిటికెలో అయిపోతుంది,రుచిలో అదిరిపోతుంది.
కావాల్సిన పదార్ధాలు
గుడ్లు – 4-5
వెల్లుల్లి – 2
ఎండుమిరపకాయలు – 2
కారం – 2 టీ స్పూన్స్
మిరియాలు -1/2 టీ స్పూన్
లవంగాలు – 3
జీలకర్ర -1 ½ టీ స్పూన్
ఆవాలు -1/2 టీ స్పూన్
కరివేపాకు – ½ కప్పు
కొత్తిమీర – ½ కప్పు
పసుపు – ½ టీ స్పూన్
ఉప్పు – ½ టీ స్పూన్
నూనె – తగినంత
తయారీ విధానం
1.మిక్సి జార్ లోకి జీలకర్ర,మిరియాలు,లవంగాలు,వెల్లుల్లి రెబ్బలు,కారం,ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
2.ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేసి అందులోకి ఆవాలు ,జీలకర్ర ,ఎండుమిర్చి ,కరివేపాకు,పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి.
3.అవి వేగాక గుడ్లను పగుల గొట్టి సొన గట్టి పడే వరకు మూతపెట్టి రెండు,మూడు నిమిషాలు వదిలేయాలి.
4.ఉడకిన గుడ్లను కట్ చేస్తు తిప్పి అటూ ఇటూ తిప్పుకోవాలి.
5.అందులోకి గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
6.మూత పెట్టుకోని మూడు,నాలుగు నిమిషాలు ప్రై చేసుకోని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవడమే..
Click Here To Follow Chaipakodi On Google News