Beauty Tips

White Hair:వైట్ హెయిర్ కు దూరంగా ఉండాలనుకుంటున్నారా.. అయితే ఇది అస్సలు మిస్ అవ్వకండి

White Hair Turn Black:తెల్లజుట్టు సమస్య వచ్చినప్పుడు మనలో చాలా మంది కంగారు పడిపోతూ మార్కెట్ లో దొరికే ఉత్పత్తుల మీద ఎక్కువగా ఆధారపడి ఎంతో డబ్భును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అయినా పెద్దగా ప్రయోజనం ఉండదు.

ఈ మధ్యకాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది. దానితో చాలా కంగారు పడిపోయి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉంటారు. తెల్ల జుట్టు రావడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి కలోంజి విత్తనాలు చాలా బాగా సహాయపడతాయి.

kalonji గింజలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే జుట్టుకు సంబంధించి కూడా ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది. కలోంజీ గింజలలో జుట్టు స్కాల్ప్‌ను శుభ్రపరిచే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. కొబ్బరినూనెలో కలోంజి గింజలను వేసి పది నిమిషాలు మరిగించాలి. ఈ నూనెను వడకట్టి చల్లారబెట్టాలి.

ఈ నూనె దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. రాత్రి పడుకొనే ముందు ఈ నూనెను జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ పెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటె తెల్లజుట్టు నల్లగా మారటమే కాకుండా చుండ్రు సమస్య,జుట్టు రాలే సమస్య తొలగిపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

https://www.chaipakodi.com/