Bathroom Tiles Cleaning:ఇలా చేస్తే బాత్రూం టైల్స్ మురికి,మొండి మరకలు పోయి కొత్తవాటిలా తళ తళ మెరుస్తాయి
Bathroom Tiles Cleaning: బాత్రూం అనేది చాలా శుభ్రంగా ఉండాలి. ఎందుకంటే ఉదయం లేచిన వెంటనే ముందుగా మనం బాత్రూంకి వెళ్ళటం జరుగుతుంది.
బాత్రూం శుభ్రంగా లేకుండా మురికిగా ఉంటే ఎన్నో వ్యాధులకు దారి తీస్తుంది. అందుకే ఇంటిని ఎలా శుభ్రం చేస్తామో అలాగే బాత్రూమ్ ని కూడా శుభ్రం చేయడం చాలా అవసరం.
బాత్ రూమ్ ఎంత శుభ్రం చేసినప్పటికీ టైల్స్ పై పేరుకుపోయిన మురికిని తొలగించడం కష్టం అవుతుంది. ఈ మురికిని, మొండి మరకలను తొలగించడానికి ఇప్పుడు చెప్పే చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. ఒక బౌల్లో రెండు స్పూన్ల బేకింగ్ సోడా, రెండు స్పూన్ల డిటర్జెంట్ పౌడర్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
మురికి, మొండి మరకలు ఉన్న టైల్స్ పై హార్పిక్ బాత్ రూమ్ క్లీనర్ అప్లై చేయాలి. ఆ తర్వాత దాని మీద బేకింగ్ సోడా, డిటర్జెంట్ పౌడర్ మిశ్రమాన్ని వేసి లాండ్రీ బ్రష్ సాయంతో రుద్దాలి. ఆ తర్వాత నీటితో శుభ్రంగా కడగాలి. ఈ విధంగా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే మురికిగా మారిపోయిన టైల్స్ మెరుస్తాయి.
హార్దిక్ బాత్రూం క్లీనర్ లో యాసిడ్ ఉంటుంది. దీనితో పాటు బేకింగ్ సోడా, డిటర్జెంట్ పౌడర్ కలపడం వలన యాసిడ్ సామర్థ్యం పెరిగి తొందరగా మురికి తొలగిపోతుంది. బాత్రూం శుభ్రం చేసినప్పుడు ఈ మిశ్రమాన్ని టైల్స్ మీద జల్లినప్పుడు చేతికి గ్లౌజెస్ వేసుకుంటే మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.