DevotionalToday Rasi Phalalu In telugu

Today Horoscope: November 21 రాశి ఫలాలు-ఈ రాశి వారికి ఆందోళన ఎక్కువ.. ప్రశాంతత తక్కువ..

Today Horoscope in Telugu: జాతకాలను నమ్మే వారు ప్రతి రోజు వారి రాశి ఫలాలను చూసుకుంటూ దానికి అనుగుణంగా అడుగులు వేస్తారు. కొంత మంది అసలు జాతకాలను పట్టించుకోరు.

మేషరాశి
ఈ రాశి వారు చేసే ప్రతి పనిని అంకితభావంతో చేయాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి,ఆందోళన లేకుండా చూసుకోవాలి.

వృషభ రాశి
ఈ రాశి వారు చేసే ప్రతి పనిని చాలా జాగ్రత్తగా చేస్తారు. అనుకున్న పనులను అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.ఆర్ధికంగా బాగుంటుంది.ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

మిధున రాశి
ఈ రాశి వారికి పట్టుదల ఎక్కువ. ఏ పని చేసినా విజయవంతం అవుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. ఒత్తిడి,ఆందోళన లేకుండా చూసుకోవాలి.ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి.

కర్కాటక రాశి
ప్రారంభించిన పనులు పూర్తి అవుతాయి. ఆర్థికపరమైన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శాంతంగా వ్యవహరించాలి. తొందరగా ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. కాస్త ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి.

సింహరాశి
ఈ రాశి వారికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన విషయాలలో ఓర్పు చాలా అవసరం. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచి ఫలితాలు వస్తాయి.ఒత్తిడి తగ్గటానికి మెడిటేషన్ వంటివి చేయాలి.

కన్యా రాశి
ఈ రాశి వారు చేసే పనులను చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. అప్పుడే విజయాన్ని సాదిస్తారు. కొన్ని సంఘటనల ద్వారా మానసిక ఆనందాన్ని పొందుతారు. శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

తులారాశి
ఈ రాశి వారు అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలకమైన విషయాలలో పెద్దలను కలుస్తారు. వివాదాల జోలికి అసలు వెళ్ళకూడదు. డబ్బు విషయంలో లోటు ఉండదు.

వృశ్చిక రాశి
ఈ రాశి వారు చేసే ప్రతి పనులు విజయవంతం అవుతారు. అలాగే ధన లాభం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆశయాల సిద్ధిస్తాయి. ఈ రాశి వారికి కాలం బాగా కలిసొస్తుంది.

ధనుస్సు రాశి
ఈ రాశి వారు ఎక్కువగా కష్టపడాలి. కీలకమైన విషయాలలో సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి
ఈ రాశి వారు వారి రంగంలో మంచి ఫలితాలను అందుకుంటారు. ఒక శుభవార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి.

కుంభరాశి
వారి రంగాల్లో విజయం సాధిస్తారు. మనోబలం కలిగి ఉంటారు. సంపూర్ణ కార్యసిద్ధి ఉంటుంది.ఆందోళన,ఒత్తిడి లేకుండా చూసుకోవాలి

మీన రాశి
ఈ రాశి వారు ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగితే సమస్య లేకుండా ఏ పని అయినా విజయవంతంగా పూర్తి చేస్తారు. అవసరానికి సహాయం అందుతుంది.ఆందోళన లేకుండా చూసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
Click Here To Follow Chaipakodi On Google News