Chemagadda Perugu Pachadi:చామ దుంప పెరుగు పచ్చడి ఇలా చేస్తే దురద అసలు ఉండదు..
Chemagadda Perugu Pachadi:చామదుంప పెరుగు పచ్చడి.. ఆరోగ్యకరమై దుంపల్లో చామ దుంప కూడ ఒకటి. చాల వరకు చామగడ్డలను ఇగురు,పులుసు చేస్తుంటారు. ఈ సారీ చామగడ్డలతో పెరుగు పచ్చడి చేసి చూడండి.
కావాల్సిన పదార్ధాలు
చామ గడ్డలు – 200 గ్రాములు
మినపప్పు – 1 స్పూన్
శనగపప్పు – 1 స్పూన్
జీలకర్ర – ½ స్పూన్
ఆవాలు -1 స్పూన్
ఎండుమిర్చి – 2
పచ్చిమిర్చి – 2
కరివేపాకు – 2 రెమ్మలు
కొత్తిమీర – కొద్దిగా
ఇంగువ – చిటికెడు
ఆవాల పొడి – ½ టీ స్పూన్
పుట్నాల పొడి – 3 టీ స్పూన్స్
పెరుగు – 1 కప్పు
నూనె – సరిపడా
తయారీ విధానం
1.ముందుగా చామ దుంపలను ఉప్పు వేసి పది,పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి.
2.ఉడకిన దుంపలను తొక్క తీసి కట్ చేసి పెట్టుకోవాలి.
3.పెరుగు పచ్చడి కోసం స్టవ్ పై బాండీ పెట్టుకోని ఆయిత్ వేడి చేసి అందులోకి శనగప్పు,మినపప్పు,వేసి దోరగా వేగాక అందులోకి జీలకర్ర,ఆవాలు వేసి వేపుకోవాలి.
4.తర్వాత ఎండుమిర్చి ,పచ్చిమిర్చి వేసి ఒక నిమిషం పాటు వేపుకోవాలి.
5.అందలోకి కరివేపాకు,ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
6. తాలింపును పూర్తిగా చల్లారిన తర్వాత అందులోకి ఆవ పొడి,పుట్నాల పొడి యాడ్ చేసి కలుపుకోవాలి.
7.చల్లారిన తాలింపులోకి ఉడికించిన చామదుంపలను వేసి ,కప్పు పెరుగును జోడించి తగినంత ఉప్పు కలుపుకోని బాగా మిక్స్ చేసుకోవాలి.
8.చివరగా అందలోకి కొత్తిమీ చల్లుకోని సర్వ్ చేసుకోవడమే.