Healthhealth tips in telugu

చలికాలంలో నల్ల మిరియాలు, బెల్లం కలిపి తీసుకుంటే ఏమి అవుతుందో తెలుసా ?

Black pepper with jaggery benefits In Telugu : బెల్లం, నల్ల మిరియాలు రెండింటిలోనూ ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి రెట్టింపు ప్రయోజనాలు అందుతాయి. బెల్లం, నల్ల మిరియాల్లో ఎక్కువగా వేడి చేసే లక్షణం ఉంటుంది. అందువలన ఈ చలికాలంలో ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి.

ఈ చలి కాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటివి చాలా తొందరగా వచ్చేస్తాయి. ఒక్కసారి వచ్చాయంటే ఒక పట్టాన తగ్గవు. 3 మిరియాల గింజలు కొంచెం బెల్లం తీసుకుని ఈ రెండింటినీ కలిపి పేస్ట్ గా చేసి తీసుకుంటే దగ్గు, జలుబు, గొంతు నొప్పి అన్ని తగ్గిపోతాయి. ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకోవాలి.

కొంతమందికి ముక్కునుండి రక్తం కారుతూ ఉంటుంది. ఈ సమస్య తగ్గాలంటే పెరుగులో కొంచెం బెల్లం, మిరియాల పొడి కలిపి తీసుకుంటే ముక్కు నుండి రక్తం కారటం తగ్గిపోతుంది. ఈ మిశ్రమం తలనొప్పిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

ఈ మధ్యకాలంలో కీళ్ల నొప్పులు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారు కూడా ప్రతిరోజు బెల్లం, మిరియాల పొడి మిశ్రమాన్ని తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది. మిరియాలలో ఉండే లక్షణాలు కీళ్ల నొప్పులు తగ్గించటానికి సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.