White To Black Hair : నాచురల్గా మీ తెల్ల జుట్టును నల్లగా మార్చేసుకోండిలా
White hair To Black Hair in Telugu : తెల్లజుట్టు సమస్య అనేది ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది. ఇలా రావటం వలన చాలా కంగారు పడి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా వాడటం వలన జుట్టు రాలే సమస్య,జుట్టు పొడిగా మారటం వంటి అనేక రకాల సమస్యలు వస్తాయి.
అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్దమైన పదార్ధాలతో చాలా సులభంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. దీని కోసం కేవలం మూడు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి కాస్త వేడి అయ్యాక రెండు స్పూన్ల టీ పొడి,రెండు స్పూన్ల కాఫీ పొడి వేసి బాగా మరిగించి డికాషన్ వడకట్టాలి.
ఒక బౌల్ లో రెండు స్పూన్ల హెన్నా పొడి వేసి దానిలో తయారుచేసి పెట్టుకున్న డికాషన్ వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని తలస్నానం చేసి జుట్టు ఆరాక నూనె రాయకుండా ఉన్న జుట్టుకు పట్టించాలి. రెండు గంటల పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.
తెల్లజుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ రోజులు, తెల్లజుట్టు తక్కువగా ఉంటే తక్కువ రోజుల సమయం పడుతుంది. కాస్త ఓపికగా ఈ రెమిడీని ఫాలో అయితే మంచి ఫలితం పొందవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/