Bread Vada:కేవలం 10 నిమిషాల్లో బ్రెడ్ తో ఇలా వడలు చేసి చూడండి.. చాలా టేస్టీగా ఉంటాయి
Bread Vada:బ్రెడ్ వడ..స్నాక్స్ ,బ్రేక్ ఫాస్ట్ ఐటమ్స్ ఎన్ని రకాలుగా చేసినా కొత్త కొత్తగా కోరుకుంటారు.ఇంట్లోఉన్న పదార్దాలతో డిఫరెంట్ డిఫరెంట్ గా తయారు చేసుకోవచ్చు.
కావాల్సిన పదార్ధాలు
బ్రెడ్ పీసెస్ – 4
బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్
మైదా పిండి – 2 టేబుల్ స్పూన్స్
ఉల్లిపాయలు – 1 కప్పు
పచ్చిమిర్చి – 3
కరివేపాకు – ½ కప్పు
కొత్తిమీర – ½ కప్పు
క్యారేట్ – ½ కప్పు
ఉప్పు –రుచికి సరిపడా
జీలకర్ర – ½ టీ స్పూన్
బేకింగ్ సోడా – చిటికెడు
నూనె – డీప్ ఫ్రై కి సరిపడా
తయారీ విధానం
1.ముందుగా బ్రెడ్ ముక్కల అంచులను కట్ చేసుకోని బ్రెడ్ పౌడర్ లా చేసుకోవాలి.
2.అందులోకి బియ్యం పిండి,మైదా ,ఉల్లిపాయలు,క్యారేట్,పచ్చిమిర్చి,ఉప్పు,కరివేపాకు,కొత్తిమీర,చిటికెడు సోడా,జీలకర్ర వేసి మిక్స్ చేసుకోవాలి.
3.కొద్ది కొద్దిగా నీళ్లను కలుపుతూ వడ పిండిలా కలుపుకోవాలి.
4.అరచేతుల పై కొద్ది కొద్దిగా పిండిని తీసుకోని వడల్లాగ వత్తుకోని ఆయిల్ వేసుకోవాలి.
5.మీడియం ఫ్లేమ్ పై వడలను రెండు వైపులా కాల్చు కోవాలి.
6.అంతే వేడి వేడి బ్రెడ్ వడ రెడీ.