Beauty Tips

Dark Circles:5 రూపాయిల ఖర్చుతో మీ డార్క్ సర్కిల్స్ ని 3 రోజుల్లో పర్మినెంట్ గా తొలిగించుకోండి

Remove Darkness Home Remedies : కళ్ళు అనేవి ముఖానికి అందాన్ని ఇస్తాయి. అలాంటి కళ్ల చుట్టూ నల్లని వలయాలు ఉంటే ముఖం అందం తగ్గటమే కాకుండా మానసికంగా కాస్త నిరాశ చెందుతాము. నల్లని వలయాలు రావటానికి పని ఒత్తిడి, నిద్రలేమి, హర్మోన్లలో మార్పులు వంటివి కారణలుగా చెప్పవచ్చు.

మనలో చాలా మంది నల్లని వలయాలు రాగానే చాలా కంగారు పడి మార్కెట్ లో దొరికే రసాయనాలతో కూడిన సౌందర్య ఉత్పత్తులను వాడుతూ ఉంటారు. వీటిని వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే వస్తువులతో నల్లని వలయాలకు చెక్ పెట్టవచ్చు.

ఒక బౌల్ లో ఒక స్పూన్ కాఫీ పొడి,చిటికెడు పసుపు, ఒక స్పూన్ పాలు, రెండు చుక్కల నిమ్మరసం, డార్క్ చాక్లెట్ కరిగించి వేసి బాగా కలపాలి. చాక్లెట్ కి బదులుగా కోకో పొడి కూడా వాడవచ్చు. ఈ మిశ్రమాన్ని కంటి చుట్టూ రాసి ఒక నిమిషం సున్నితంగా మసాజ్ చేసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆ తర్వాత కొబ్బరి నూనె రాసి సున్నితంగా మసాజ్ చేస్తే రక్తప్రసరణ బాగా సాగి డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. ఈ విధంగా మూడు రోజుల పాటు చేస్తే కంటి చుట్టూ నల్లని వలయాలు అన్నీ తొలగిపోయి ముఖం అందంగా కనపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.