మీ మోచేతులు నల్లగా మారాయా? – ఈ టిప్స్‌తో అందంగా మెరిసిపోవడం ఖాయం!
How to Get rid of Dark Elbows and Knees : మోకాళ్ళు, మోచేతుల మీద నలుపు ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ నలుపును తగ్గించుకోవటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన పెద్దగా ఫలితాన్ని ఇవ్వక ఎంతో నిరాశకు గురి అవుతూ ఉంటారు. అలాంటి వారు ఈ చిట్కా ఫాలో అయితే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
ఈ చిట్కా కోసం ఒక బౌల్ లో ఒక షాంపూ పేకెట్ లో షాంపూను వేయాలి. దానిలో అరచెక్క నిమ్మరసం, రెండు స్పూన్ల టమోటా రసం, పావు స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మోకాళ్లు, మోచేతులపై నలుపు ఉన్న ప్రదేశంలో రాసి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.
ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే క్రమంగా నలుపు తగ్గి మృదువుగా మారతాయి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. టమోటా,నిమ్మలో ఉన్న బ్లీచింగ్ లక్షణాలు నలుపును తగ్గించటానికి సహాయపడతాయి. ఆర్గానిక్ పసుపు వాడితే మంచిది. షాంపూ ఏ కంపెనీ అయిన పర్వాలేదు. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితం తప్పనిసరిగా వస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.