Turmeric For Face:పసుపులో ఇది కలిపి రాస్తే ఎంత నల్లని ముఖం అయినా 5 నిమిషాల్లో తెల్లగా మారటం ఖాయం
Turmeric and coffee Face Glow Tips In Telugu : ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ ముఖం అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. మనలో చాలా మంది ముఖం అందంగా, కాంతి వంతంగా ఉండటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే దాని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి వేల కొద్దీ డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు. అయినా అది తాత్కాలికమే.
ఆలా కాకుండా మన ఇంటిలో దొరికే వస్తువులతో ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే ముఖం అందంగా మెరవటమే కాకుండా ఖర్చు కూడా చాలా తక్కువగా అవుతుంది. సాదరణంగా మనం ఏదైనా ఫంక్షన్ కి వెళ్లాలని అనుకున్నప్పుడు బ్యూటీ పార్లర్ కి వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టి రకరకాల facials చేయించు కుంటాం. ఆలా చేయించుకుంటే ముఖం అందంగా మెరిసిపోతూ ఉంటుందని భావిస్తాం.
అయితే ఎటువంటి బ్యూటీ పార్లర్ అవసరం లేకుండా ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే ముఖం అందంగా,ప్రకాశవంతంగా మారుతుంది. ఒక బౌల్ లో ఒక స్పూన్ పంచదార,ఒక స్పూన్ కాఫీ పొడి,అరస్పూన్ పసుపు, కొంచెం నీటిని వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది. పసుపు జిడ్డు చర్మం,పొడి చర్మం ఇలా అన్ని చర్మ తత్వాలకు సెట్ అవుతుంది. ముఖం కాంతివంతంగా మారటానికి సహాయపడుతుంది. పంచదార ఎక్స్ ఫ్లోయిట్ గా పనిచేసి చర్మంపై మృత కణాలను తొలగిస్తుంది.
కాఫీలో ఉండే కెఫీన్ మృత కణాలు,చర్మంపై మలినాలను తొలగించి ముఖం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే మంచి పలితాలను పొందవచ్చు. ఈ చిట్కాలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు చర్మానికి పోషణ అందిస్తాయి. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.