Kitchenvantalu

Garlic Tips : ఇలా చేస్తే..వెల్లుల్లి ఫ్లేవర్ పోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి

Garlic Tips in telugu : ఈ మధ్య కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ద పెరిగి వెల్లుల్లి వాడకం చాలా ఎక్కువ అయింది. వెల్లుల్లిని సాదారణంగా అరకేజీ, పావు కేజీ చొప్పున కొంటాం. అవి ఒక్కోసారి తొందరగా పాడయ్యిపోతాయి. ఒక్కోసారి తక్కువ ధరకు వచ్చాయని ఎక్కువ మొత్తంలో కూడా కొంటూ ఉంటాం.

వెల్లుల్లిలో దాదాపు 11 రకాలు ఉన్నాయి. వెల్లుల్లిని కొనేటప్పుడు గుండ్రంగా ఉండేవి, పెద్ద రెబ్బలు ఉండేవి కొనుక్కోవాలి. రెబ్బలు గట్టిగా ఉన్నా, నల్లగా ఉన్నా, మొలకెత్తుతున్నా అలాంటి వెల్లుల్లిని అసలు కొనకూడదు. వెల్లుల్లిని రెబ్బలు విడగొట్టకుండా నిల్వ చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.

ఒకవేళ రెబ్బలు విడదీస్తే.. 10 రోజులకు మించి నిల్వ ఉండవు. కొంత మంది వెల్లుల్లిని ఫ్రిజ్ లో నిల్వ చేస్తారు. అయితే వాటిని బయటకు తీసిన కొన్ని రోజుల్లోనే మొలకలు వస్తాయి. అందువల్ల ఫ్రిజ్ లో పెడితే…గాలి చేరని సీసాలో ఉంచి.. ఫ్రిజ్‌లో 2 వారాల వరకూ నిల్వ చేయవచ్చు. అయితే ఫ్రిజ్ లో పెట్టటం వలన రుచి,వాసన తగ్గుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News