Kitchenvantalu

kitchen Hacks:వంటింటిలో ఉపయోగపడే కొన్ని సులభమైన వంటింటి చిట్కాలు

Kitchen Hacks and tricks: వంటింటిలో పనులు సులువుగా అవ్వాలంటే కొన్ని చిట్కాలను ఫాలో అవ్వాలి. ఈ చిట్కాలను పాటిస్తే తక్కువ సమయంలో ఎక్కువ పని చేయవచ్చు. కాబట్టి ఇప్పుడు చెప్పే చిట్కాలు పాటిస్తే పనులు సులువుగా అవుతాయి.

డయాబెటిస్ ఉన్నవారిలో అన్నం తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండాలంటే అన్నం ఉడికించినప్పుడు చిన్న దాల్చిన చెక్క ముక్క వేస్తే సరిపోతుంది.

బియ్యం,పప్పులు పురుగు పట్టకుండా ఉండాలంటే గుప్పెడు వేపాకులు లేదా పసుపు కొమ్ములు లేదా వెల్లుల్లి రెబ్బలు వేస్తే ఎన్ని రోజులు అయినా పురుగు పట్టకుండా నిల్వ ఉంటాయి.

పాప్ కార్న్ చేసినప్పుడు మొక్కజొన్న గింజలను డీప్ ఫ్రిజ్లో పెట్టి అరగంట తర్వాత వేగిస్తే  పాప్ కార్న్ బాగా పెద్ద సైజు లో వస్తాయి. అలాగే మంచి రుచిగా ఉంటాయి.

కార్పెట్ మీద మురికి పోయి కొత్తదానిలా మెరవాలంటే…కార్పెట్ మీద కార్న్ ఫ్లోర్ పిండి చల్లి వ్యాక్యూమ్ క్లియర్ తో శుభ్రం చేస్తే సరిపోతుంది.

మిక్సీ జార్ లో బ్లేడ్స్ పదును తగ్గితే…మిక్సీలో ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది.

పాలు విరుగుతాయని అనుమానం ఉన్నప్పుడు కాచే ముందు పాలల్లో చిటికెడు వంట సోడా కలిపితే పాలు విరగవు.

చలికాలంలో పెరుగు త్వరగా గట్టిగా తోడుకోదు పాలు తోడు పెట్టినప్పుడు వాటిలో ఒక ఎండు మిరపకాయ వేస్తే పెరుగు గట్టిగా త్వరగా తోడుకుంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News

https://www.chaipakodi.com/