Onion Smell :చేతులకు ఉల్లి,వెల్లుల్లి వాసన వదలటం లేదా…ఈ చిట్కాలు TRY చేయండి
Onion and garlic Smell remove Tips:ఉల్లిపాయలను కోసినప్పుడు వెల్లుల్లిపాయలను వలిచినప్పుడు చేతులు వాసన వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఉల్లి, వెల్లుల్లి వంటి వాటికి ఘాటైన వాసన ఉంటుంది. మనం చేతులను ఎంత శుభ్రం చేసుకున్న ఆ వాసన వదలదు. ఉల్లి,వెల్లుల్లి వాసన తొలగిపోవాలంటే ఇప్పుడు చెప్పే చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.
గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండి బాగా కలిపి ఆ నీటిలో చేతులను కాసేపు ఉంచితే ఉల్లి,వెల్లుల్లి వాసన తొలగిపోతుంది. ఒక బౌల్ లో ఒక స్పూన్ బేకింగ్ సోడా, అర స్పూన్ ఉప్పు వేసి నీటిని పోసి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని చేతులకు రాసి రెండు నిమిషాల పాటు రుద్దుకొని చేతులు కడిగితే వాసన తొలగిపోతుంది.
అరచేతులపై కాఫీ పౌడర్ జల్లుకుని తడిచేసి చేతులను రబ్ చేస్తే వాసన తొలగిపోతుంది. ఇప్పుడు చెప్పిన చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. కాబట్టి ఈ చిట్కాలను ఫాలో అయ్యి ఉల్లి,వెల్లుల్లి వాసనను తొలగించుకోండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
https://www.chaipakodi.com/