Hair Dye: తెల్లజుట్టు సమస్య వేధిస్తోందా? ఇంట్లోనే ఈజీగా ఇలా హెయిర్ డై చేసుకుని వాడండి
white hair causes and ways to prevent it:మనలో చాలా మంది తెల్లజుట్టు రాగానే చాలా కంగారు పడి మార్కెట్ లో దొరికే ఉత్పత్తులను వాడుతూ ఉంటారు. అలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫ్ఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఇంటి చిట్కాలతో సులభంగా ప్రయత్నం చేయవచ్చు. ఈ రోజుల్లో చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావటంతో చాలా కంగారు పడి మార్కెట్లో దొరికే hair డ్రై వాడుతున్నారు. అలా వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి ఒక మంచి చిట్కా తెలుసుకుందాం
స్టవ్ మీద గిన్నె పెట్టి గ్లాసున్నర నీటిని పోయాలి. నీళ్లు కాస్త వేడెక్కాక మూడు స్పూన్లు టీ పౌడర్ వేయాలి. ఇది బాగా మరుగుతున్నప్పుడు నాలుగు లవంగాలు వేయాలి. ఐదు నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చెయ్యాలి. టీ డికాషన్ వడకట్టాలి.
బీట్రూట్ తీసుకుని పైన చెక్కు తీసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. దీని నుంచి రసాన్ని తీయాలి. ఈ బీట్రూట్ రసాన్ని ఐరన్ పాన్లో వేసుకోవాలి. ఇందులో రెండు స్పూన్ల కాఫీ పొడి ఒక స్పూన్ ఉసిరి పొడి, ఒక స్పూన్ హెన్నా పొడి వేసి బాగా కలపాలి. దీనిలో ముందుగా తయారు చేసుకున్న టీ డికాషన్ కలపాలి.
ఆ తరువాత ఒక నిమ్మకాయ పూర్తిగా పిండాలి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా అలా వదిలేస్తే మరుసటి రోజు ఈ మిశ్రమం నల్లగా మారుతుంది. ఈ మిశ్రమాన్ని తలకు రాసి రెండు గంటల తర్వాత తల స్నానం చేయాలి. ముందుగా జుట్టు బ్రౌన్ కలర్ లోకి వస్తుంది. తరచూ వాడుతూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.
కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వైపు చూడవలసిన అవసరం ఉండదు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/