Beauty TipsKitchenvantalu

Face Glow Tips:ముఖంపై నల్లటి మచ్చలతో టెన్షనా…?.. ఈ సింపుల్ టిప్స్ తో మీ ఫెస్ మెరిసిపోవాల్సిందే..

Kalonji seeds For Face:ముఖం మీద నల్లని మచ్చలు,మొటిమలు అనేవి తగ్గాలంటే ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కాస్త ఓపికగా సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

ప్రతి ఒక్కరు ముఖం తెల్లగా మచ్చలు లేకుండా కాంతివంతంగా రావాలని కోరుకుంటారు. దీని కోసం మార్కెట్లో దొరికే రకరకాల వాడుతూ ఉంటారు. అయినా ఫలితం తాత్కాలికంగా ఉంటుంది కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. అది ఇంటి చిట్కాలను ఉపయోగిస్తే ముఖం ముడతలు లేకుండా నల్లని మచ్చలు లేకుండా మెరిసేలా చేసుకోవచ్చు. దీనికోసం కలోంజి విత్తనాలు చాలా బాగా సహాయపడుతాయి.

కలోంజి విత్తనాలను మెత్తని పౌడర్ గా తయారు చేసుకోవాలి. ఒక బౌల్ లో ఒక స్పూన్ కలోంజి పౌడర్ లో ఒక స్పూన్ పెరుగు,ఒక స్పూన్ తేనె కలిపి ముఖానికి రాయాలి. 15 నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తే వృద్ధాప్య సంకేతాలను తగ్గించడమే కాకుండా ముఖం మీద మచ్చలు,మొటిమలు ఏమి లేకుండా ముఖం కాంతివంతంగా తెల్లగా మెరుస్తుంది. kalonji గింజలు ఒకప్పుడు అరుదుగా లభించేవి. కానీ ఇప్పుడు చాలా విరివిగా లభ్యం అవుతున్నాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.