Vruschika rasi:వృశ్చిక రాశి వారిని పెళ్లి చేసుకుంటున్నారా… ఈ విషయాలు తెలుసుకోండి
Vruschika rasi phalalu 2024 in telugu: మనలో చాలా మంది జాతకాలను నమ్ముతూ ఉంటారు. మరి కొంత మంది జాతకాలను అసలు నమ్మరు. వృశ్చిక రాశిని ఇంగ్లిష్ లో స్కార్పియో అని అంటారు. రాశి చక్రములోని రాశులలో ఎనిమిదవది. ఇది వలయములో 210 నుండి 240 డిగ్రీల వరకు విస్తరించి ఉంది. ఉష్ణమండల రాశిచక్రములో, సూర్యుడు వృశ్చిక రాశిలో ప్రతి సంవత్సరము అక్టోబర్ 23 నుండి నవంబర్ 21 వరకు ఉంటాడు.
విశాఖ 4వ పాదం,అనురాధ 4 పాదాలు ,జ్యేష్ట 4 పాదాలు వృశ్చిక రాశి కిందకు వస్తాయి. వృశ్చిక రాశి వారితో మాట్లాడేటప్పుడు,వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు చెప్పుతున్నారు. ఒకవేళ జాగ్రత్తగా లేకపోతే వారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. వృశ్చిక రాశివారు విచిత్రమైన ధోరణి కలిగి ఉంటారు. ఏ విషయాన్నీ అంత తేలిగ్గా వదలరు. ఈ రాశివారికి ప్రతీకారేచ్చ చాలా ఎక్కువగా ఉంటుంది.
వృశ్చిక రాసివారితో ప్రేమలో ఉన్నా లేదా వైవాహిక బంధంలో ఉన్నా ఇప్పుడు చెప్పే విషయాలను ఎప్పుడు గుర్తు పెట్టుకొని మెలగాలి. లేకపోతే వృశ్చిక రాసివారితో కష్టమే. వృశ్చిక రాశివారు మిగతా రాశులతో పోలిస్తే చాలా కఠినమైన ప్రతీకారేచ్చను కలిగి ఉంటారు. ఎవరైనా వృశ్చిక రాశి వారిని తప్పుగా అనుకుంటే వారిని జీవితంలో ఎప్పటికి క్షమించలేరు.
వారి నమ్మకాన్ని వమ్ము చేసిన పక్షంలో వృశ్చిక రాశి వారు చాలా కఠినంగా మారిపోతారు. వీరి ఆగ్రహం తగ్గాలంటే కాస్త దైవ అనుగ్రహం తప్పనిసరి. వీరికి ఓర్పు తక్కువ, క్రమంగా, పగ తీర్చుకోవడానికి ఎక్కువ కాలం తీసుకోరు కూడా. ఈ రాశివారు బంధాలకు విలువ ఇస్తారు. కాబట్టి కోపం ఎక్కువ రోజులు ఉండదు.
ఈ రాశి వారు ఎవరిని ఒక పట్టాన నమ్మరు. నమ్మితే ఏమి చేయటానికి అయినా రెడీగా ఉంటారు. ఎవరైనా నమ్మకద్రోహం చేస్తే మాత్రం జీవితంలో అసలు క్షమించరు. ఎవరైనా ఈ రాశివారిని తమని నమ్మమని అడిగితే విపరీతమైన కోపం వస్తుంది. కాబట్టి ఈ రాశివారిని నమ్మమని అడగటం కన్నా వారు నమ్మే విధంగా ప్రవర్తిస్తే మంచిది.
వృశ్చిక రాశికి చెందిన వ్యక్తులు ఒక వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తారో,తేడా వస్తే అంతే ద్వేషిస్తారు. వీరు మానసికంగా చాలా స్పష్టంగా ఉంటారు. ఈ రాశివారి అంతర్గత ఆలోచనలు చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. తమను తాము నాశనం చేసుకునైనా, తమ పంతం నెగ్గించుకుంటారు కానీ, ఆలోచనలకు భిన్నంగా వ్యక్తిత్వాన్ని మార్చుకొనుటకు సిద్దంగా ఉండరు.
అటువంటి స్వభావాన్ని అసూయ అని భావిస్తే, వీరి కోపం కట్టలు తెంచుకుంటుంది. వృశ్చిక రాశి వారికి, ఈర్ష్య అనేది వారి బలమైన లక్షణాల్లో ఒకటిగా ఉంటుంది. పగ, అసూయలతో కూడుకుని కనిపిస్తుంటారు. కావున. వీరితో జీవితాన్ని పంచుకోవాలని అనుకున్న లేదా జీవితాన్ని పంచుకుంటున్న వారైనా వారి లక్షణాలను ప్రశ్నించకుండా జాగ్రత్త పడండి. ఒకవేళ ప్రశ్నిస్తే జీవితం నరకమే.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.