Kitchenvantalu

Gas Stove Cleaning tips:గ్యాస్ స్టవ్ జిడ్డుగా మారిందా.. ఇలా చేస్తే నిమిషంలో క్లీన్ అవుతుంది

Gas Stove Cleaning tips:గ్యాస్ స్టవ్ జిడ్డుగా మారిందా.. ఇలా చేస్తే నిమిషంలో క్లీన్ అవుతుంది.. మనం వంటింట్లో పనులను చాలా స్పీడ్ గా చేసేస్తూ ఉంటాం. అలా చేసినప్పుడు గ్యాస్ స్టవ్ టాప్ మీద ఎన్నో పదార్ధాలు పడి ఎంతో మురికిగా మారిపోతుంది. అంతేకాకుండా గ్యాస్ స్టవ్ టాప్ మీద జిడ్డుగా మారుతుంది. అలాగే స్టవ్ మంట కారణంగా మరకలు ఎండిపోయి శుభ్రం చేయటానికి చాలా కష్టం అయిపోతుంది. గ్యాస్ స్టవ్ శుభ్రం చేయడం చాలా కష్టమైన పని.

ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అయితే చాలా సులభంగా గ్యాస్ స్టవ్ టాప్‌ను శుభ్రం చేయవచ్చు. గోరువెచ్చని నీటిలో కొంచెం సర్ఫ్ బాగా కలిపి స్పాంజి ముంచి గ్యాస్ స్టవ్ టాప్ ని శుభ్రం చేయాలి. ఆ తర్వాత శుభ్రమైన పొడి క్లాత్ తో తుడవాలి. ఆ తర్వాత గ్లాస్ స్టవ్ మీద బేకింగ్ సోడా జల్లి నిమ్మకాయ తొక్కతో శుభ్రం చేయాలి. బేకింగ్ సోడా,నిమ్మకాయ కఠినమైన మరకలను తొలగించటమే కాకుండా మురికిని, జిడ్డును తొలగిస్తుంది.

ఒక గిన్నెలో నీటిని పోసి డిష్ సోప్, బేకింగ్ సోడా సమాన భాగాలుగా వేసి బాగా కలిపి దానిలో బర్నర్ స్టాండ్స్ ఉంచాలి. 15 నిమిషాలు అయ్యాక శుభ్రమైన నీటితో కడిగితే జిడ్డు అంతా తొలగిపోయి శుభ్రంగా మారుతాయి. బేకింగ్ సోడా, ఉప్పు సమాన భాగాలుగా తీసుకుని నీటితో పేస్ట్ గా తయారు చేయాలి.

ఈ పేస్ట్ ని గ్యాస్ స్టవ్ టాప్ మీద మరియు బర్నర్స్ స్టాండ్ కి రాసి పది నిమిషాలు అలా వదిలేయాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేస్తే జిడ్డు, మరకలు, మురికి అన్ని తొలగిపోతాయి. ఇప్పుడు చెప్పిన విధానాలలో ఏ విధానం అయినా మంచి ఫలితాన్ని అందిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.