Healthhealth tips in telugu

Joint Pains:15 రోజులు తాగితే కీళ్ల నొప్పులు, శారీరక నొప్పులు, కండరాల నొప్పులు ఉండవు

Joint Pains:15 రోజులు తాగితే కీళ్ల నొప్పులు, శారీరక నొప్పులు, కండరాల నొప్పులు ఉండవు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సరైన పోషకాహారం తీసుకోకపోవడం, టైంకి తినక పోవటం, నిద్ర సరిగా లేకపోవడం, పని ఒత్తిడి వంటి కారణాలతో తక్కువ పని చేసిన త్వరగా అలసిపోతున్నారు. అలాగే calcium లోపం కారణంగా ఎముకల బలం తగ్గడం,పేలుసుగా మారటం, మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు రావడం జరుగుతుంది.

ఈ లక్షణాలు ప్రారంభ దశలో అంటే తక్కువగా ఉన్నప్పుడు ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. పెయిన్ కిల్లర్స్ తాత్కాలికంగా మాత్రమే పని చేస్తాయి. అదే ఇప్పుడు .చెప్పే చిట్కా ఫాలో అయితే అన్ని తగ్గిపోతాయి. ఒకప్పుడు 60 సంవత్సరాలు వచ్చే సరికి వచ్చే నొప్పులు. ఇప్పుడు 30 సంవత్సరాలు వచ్చేసరికి వచ్చేస్తున్నాయి.
Lotus Seeds benefits In Telugu
ఇప్పుడు తయారుచేసుకొనే పొడిని 15 రోజులపాటు వాడితే అన్నీ సమస్యలు తగ్గిపోతాయి. దీని కోసం ఒక పాన్ లో 6 బాదం పప్పులు, 12 పూల్ మఖానా, పావుస్పూన్ మెంతులు, ఒక స్పూన్ గసగసాలు, అంగుళం దాల్చిన చెక్క ముక్క వేసి వేగించాలి. బాగా వేగాక మిక్సీ జార్ లో వేయాలి. ఆ తర్వాత పావు స్పూన్ పసుపు, పావుస్పూన్ శొంఠి పొడి వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి.
fenugreek seeds
ఈ పొడిని డబ్బాలో పోసుకొని నిల్వ చేసుకోవాలి. ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో అరస్పూన్ పొడి కలుపుకొని ఉదయం సమయంలో తాగాలి. ఉదయం సమయంలో తాగితే అన్నీ సమస్యలు తగ్గటమే కాకుండా రోజంతా హుషారుగా ఉంటారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.