Dry fruits for diabetes: డయాబెటిస్ ఉన్నవారు డ్రైఫ్రూట్స్ తినొచ్చా?
Dry fruits for diabetes: డయాబెటిస్ ఉన్నవారు డ్రైఫ్రూట్స్ తినొచ్చా.. డయాబెటిస్ పేషెంట్లు రోజువారీ జీవితంలో అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది? పండ్లు తినొచ్చా? డ్రై ఫ్రూట్స్ తినొచ్చా? వంటి సవాళ్లు ఎదురవుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు డ్రైఫ్రూట్స్ నిరభ్యంతరంగా తినొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
డయబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం అనేది డయబెటిస్ ఉన్నవారిలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే ఆహారాలను తీసుకోకుండా ఉండాలి. భోజనం తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మంచి ప్రయోజనం కలుగుతుంది.
బాదం గ్లైజమిక్ ఇండెక్స్ 5.బాదంలో ఉన్న పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచకుండా నిరోదిస్తుంది. భోజనం అయ్యాక బాదం పప్పును తింటే గ్లూకోజ్ స్థాయిలను 30 శాతం తగ్గిస్తుంది. ప్రతి రోజు 3 లేదా 4 బాదం పప్పులను మాత్రమే తీసుకోవాలి.
మెదడు ఆకారంలో ఉండే వాల్ నట్స్ గ్లైజిమిక్ ఇండెక్స్ 15. వాల్‌నట్స్ ఇన్సులిన నిరోధకతను పెంపొందించడానికి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడానికి మరియు టైప్ -2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. రోజులో 2 వాల్ నట్స్ తినాలి.
అంజీర్ గ్లైజిమిక్ ఇండెక్స్ 51. అంజీర్ లో ఫైబర్ సమృద్దిగా ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించటంలో సహాయపడుతుంది. ఫైబర్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.కాబట్టి, మీ శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను బాగా నియంత్రించవచ్చు. రోజుకి ఒక అంజీర్ తీసుకోవాలి.
పిస్తా గ్లైజిమిక్ ఇండెక్స్ 18. పిస్తా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని అధ్యయనాలు కూడా హైలైట్ చేశాయి.రోజులో 4 పిస్తా పప్పులను తినవచ్చు.
వేరుశనగ గ్లైజిమిక్ ఇండెక్స్ 14. రోజుకి 8 నుంచి 10 గింజలు తినవచ్చు. జీడిపప్పు గ్లైజిమిక్ ఇండెక్స్ 22. రోజుకి 5 పప్పులను తినవచ్చు. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటే డయబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా డయబెటిస్ కారణంగా వచ్చే నీరసం,నిసత్తువ వంటివి ఉండవు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.