నెల రోజులు టీ మానేస్తే.. బాడీలో జరిగే అద్భుతాలు!

చాలా మందికి ఉదయం లేవగానే వేడివేడి టీ పడాల్సిందే. కానీ ఒక్క నెల రోజుల పాటు టీకి దూరంగా ఉంటే మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా? ఆ వివరాలు ఈ స్టోరీలో..

టీలోని కెఫీన్ మీ నిద్రను దెబ్బతీస్తుంది. టీ మానేసిన మొదటి వారంలోనే మీ నిద్ర నాణ్యత పెరుగుతుంది. మీరు ప్రశాంతంగా, గాఢంగా నిద్రపోతారు.

టీలో ఉండే 'టానిన్స్' పళ్లపై పసుపు రంగు మరకలను ఏర్పరుస్తాయి. నెల రోజుల పాటు టీ మానేస్తే మీ పళ్లు సహజమైన రంగులోకి మారి, మరింత తెల్లగా కనిపిస్తాయి.

కెఫీన్ రక్తంలో కలిసినప్పుడు గుండె వేగాన్ని పెంచి, తెలియని కంగారును కలిగిస్తుంది. టీ మానేయడం వల్ల మీ మెదడు ప్రశాంతంగా మారి, ఒత్తిడి తగ్గుతుంది.

ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటీ వస్తాయి. టీ మానేస్తే జీర్ణ వ్యవస్థ సాఫీగా పనిచేస్తుంది, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి.

టీ 'డైయూరెటిక్'గా పనిచేస్తుంది, అంటే ఇది శరీరం నుండి నీటిని త్వరగా బయటకు పంపుతుంది. టీ మానేయడం వల్ల మీ శరీరం ఎక్కువ కాలం హైడ్రేటెడ్‌గా ఉంటుంది.

టీలోని టానిన్స్ మనం తినే ఆహారంలోని ఐరన్, కాల్షియంను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. టీ మానేస్తే మీ శరీరానికి పోషకాలు పూర్తిస్థాయిలో అందుతాయి.

శరీరం హైడ్రేటెడ్‌గా ఉండటం వల్ల చర్మం పొడిబారదు. మొటిమలు తగ్గి, చర్మం సహజంగా మెరుస్తుంది. యాంటీ ఏజింగ్ ప్రభావం కూడా కనిపిస్తుంది.

కెఫీన్ తాత్కాలికంగా రక్తపోటును పెంచుతుంది. టీ మానేయడం వల్ల మీ రక్తపోటు స్థిరంగా ఉంటుంది, ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.

టీ ఆపేసిన మొదటి 3-4 రోజులు తలనొప్పి, నీరసంగా అనిపించవచ్చు (Caffeine Withdrawal). కానీ వారం తర్వాత మీ శక్తి సామర్థ్యాలు రెట్టింపు అవుతాయి.

మీరు పాలు, చక్కెర కలిపిన టీ తాగుతుంటే.. దాన్ని మానేయడం వల్ల క్యాలరీలు తగ్గుతాయి. ఇది మీ వెయిట్ లాస్ జర్నీకి ఎంతగానో సహాయపడుతుంది.

ఆరోగ్యం కోసం టీకి బదులుగా గ్రీన్ టీ లేదా హెర్బల్ టీలను ప్రయత్నించండి. ఒక్క నెల పాటు ఈ మార్పు చేసి చూడండి, మీ శరీరం మీకు థాంక్స్ చెబుతుంది!