చెమట వాసన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? ఈ మ్యాజిక్ టిప్స్ మీకోసమే!

ఎండకాలం వచ్చేసింది.. చెమట వాసనను దూరం చేసి రోజంతా ఫ్రెష్‌గా ఉండటానికి ఈ సింపుల్ ట్రిక్స్ పాటించండి.

నిమ్మరసంలో ఉండే యాసిడ్ గుణాలు బ్యాక్టీరియాను చంపుతాయి. స్నానం చేసే నీళ్లలో అర చెక్క నిమ్మరసం కలిపితే చెమట వాసన మాయం.

బేకింగ్ సోడా చెమటను పీల్చుకోవడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కొంచెం నీటితో కలిపి పేస్ట్‌లా చేసి చంకల్లో రాసుకుంటే దుర్వాసన రాదు.

ఇది చర్మం యొక్క pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. ఒక కాటన్ బాల్‌తో యాపిల్ సైడర్ వెనిగర్‌ను అప్లై చేస్తే బ్యాక్టీరియా వృద్ధి చెందదు.

వేప ఆకులు యాంటీ సెప్టిక్ లా పనిచేస్తాయి. వేప ఆకులు మరిగించిన నీటితో స్నానం చేయడం వల్ల చర్మంపై ఇన్ఫెక్షన్లు తగ్గడమే కాకుండా వాసన రాకుండా ఉంటుంది.

టొమాటో రసానికి రంధ్రాలను కుంచించే గుణం ఉంటుంది. స్నానం చేసే నీటిలో ఒక కప్పు టొమాటో జ్యూస్ కలిపితే విపరీతమైన చెమటను అరికట్టవచ్చు.

సింథటిక్ బట్టలు వేసవిలో చెమటను పీల్చుకోవు, దీనివల్ల బ్యాక్టీరియా పెరిగి వాసన వస్తుంది. ఎప్పుడూ కాటన్ (నూలు) దుస్తులనే ఎంచుకోండి.

శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లాలంటే నీరు బాగా తాగాలి. బాడీ హైడ్రేటెడ్‌గా ఉంటే చెమట వాసన కూడా తగ్గుతుంది.

ఎక్కువ మసాలాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి తినడం వల్ల చెమట వాసన పెరుగుతుంది. సమ్మర్‌లో చలువ చేసే ఆహార పదార్థాలు తీసుకోండి.

బంగాళాదుంప ముక్కతో చంకల భాగంలో రుద్దడం వల్ల కూడా చెమట వాసన తగ్గుతుంది. ఇది చర్మాన్ని కూల్‌గా ఉంచుతుంది.

పాదాల చెమట వల్ల కూడా దుర్వాసన వస్తుంది. షూస్ వాడేవారు కాటన్ సాక్స్ వాడాలి, అలాగే చెప్పులను ఎప్పటికప్పుడు ఎండలో ఆరబెట్టాలి

ఈ చిట్కాలతో పాటు రోజుకు రెండుసార్లు స్నానం చేయడం అలవాటు చేసుకోండి. వేసవిని ఆత్మవిశ్వాసంతో ఆస్వాదించండి!