కొబ్బరి నీళ్లు + నిమ్మరసం: అద్భుత ప్రయోజనాలు

కొబ్బరి నీళ్లు, నిమ్మరసం రెండింటిలోనూ ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి వేసవిలో లేదా వ్యాయామం తర్వాత శరీరాన్ని త్వరగా హైడ్రేట్ చేస్తాయి

పరగడుపున ఈ మిశ్రమాన్ని తాగడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. ఇది కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.

నిమ్మకాయలో ఉండే విటమిన్-సి, కొబ్బరి నీళ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు కలిసి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను, టాక్సిన్లను బయటకు పంపి శరీరాన్ని శుభ్రపరిచే సహజసిద్ధమైన డిటాక్స్ డ్రింక్ ఇది.

నిమ్మరసంలోని విటమిన్-సి, కొబ్బరి నీళ్లలోని తేమ చర్మాన్ని మరింత కాంతివంతంగా, యవ్వనంగా ఉంచుతాయి.

అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గించడంతో పాటు మలబద్ధకాన్ని నివారించి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

నిమ్మకాయలోని సిట్రేట్, కొబ్బరి నీళ్లలోని పొటాషియం.. కిడ్నీల్లో రాళ్లు (Kidney stones) ఏర్పడకుండా అడ్డుకుంటాయి.

అలసటగా అనిపించినప్పుడు ఈ పానీయం తాగితే, శరీరానికి కావాల్సిన సహజ చక్కెరలు అంది తక్షణ ఉత్తేజం వస్తుంది.

కొబ్బరి నీళ్లలో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును అదుపులో ఉంచి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

శరీరంలో తగ్గిన ఎలక్ట్రోలైట్స్‌ను భర్తీ చేసి హ్యాంగోవర్ (Hangover), తలనొప్పి నుంచి వేగంగా ఉపశమనం అందిస్తుంది.