కీరదోసతో మొటిమలు, నల్లమచ్చలకు చెక్!

కీరదోసలో ఉండే కూలింగ్ ఎఫెక్ట్ చర్మాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. ఇది మొటిమల వల్ల వచ్చే మంట, ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది.

కీరదోస రసాన్ని కాటన్ బాల్‌తో ముఖానికి రాసుకోవడం వల్ల ఓపెన్ పోర్స్ (చర్మ రంధ్రాలు) తగ్గి, దుమ్ము చేరకుండా ఉంటుంది.

కీరదోస రసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాస్తే.. మొటిమల తాలూకు నల్లమచ్చలు త్వరగా మాయమవుతాయి.

ఈ రెండింటి మిశ్రమం మొటిమలను తగ్గించడమే కాకుండా, డ్యామేజ్ అయిన చర్మాన్ని రిపేర్ చేస్తుంది.

కీరదోస రసంలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి రాస్తే, అందులోని విటమిన్-సి చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది.

కీరదోస రసాన్ని ఐస్ ట్రేలో పోసి ఫ్రీజ్ చేయండి. ఈ ఐస్ క్యూబ్స్‌తో ముఖంపై మసాజ్ చేస్తే ముఖంపై వాపు తగ్గి ఇన్స్టంట్ గ్లో వస్తుంది.

కీరదోస పేస్ట్‌లో కొద్దిగా పెరుగు కలిపి ప్యాక్‌లా వేసుకుంటే.. చర్మంపై ఉన్న టాన్ తొలగిపోతుంది.

రోజు చివర్లో కీరదోస ముక్కలను కళ్లపై, ముఖంపై ఉంచుకుంటే ఒత్తిడి తగ్గి చర్మం తాజాగా మారుతుంది.

కేవలం ప్యాక్స్ వేసుకోవడమే కాదు, రోజూ కీరదోస తినడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోయి చర్మం మెరుస్తుంది.

సహజసిద్ధమైన చిట్కాలు కాబట్టి వారానికి కనీసం 2 నుండి 3 సార్లు వాడితేనే మంచి ఫలితం కనిపిస్తుంది.

మీ చర్మం చాలా సెన్సిటివ్ అయితే, ముఖానికి అప్లై చేసే ముందు ఒకసారి చేతిపై ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మర్చిపోకండి!