రోజూ కాఫీ తాగే అలవాటు ఉందా? అయితే మీ శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసా..
మీ రోజును వేడివేడి కాఫీతో స్టార్ట్ చేస్తున్నారా? అయితే మీ శరీరంలో జరిగే ఈ ఆసక్తికరమైన, నమ్మలేని మార్పుల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి!
కాఫీలోని కెఫిన్ శరీరంలోకి చేరగానే, అలసటను కలిగించే 'ఎడెనోసిన్' అనే రసాయనాన్ని బ్లాక్ చేస్తుంది. దీనివల్ల బ్రెయిన్ అలర్ట్‌గా, కంటిన్యూస్‌గా యాక్టివ్‌గా మారుతుంది.
కాఫీ తాగిన వెంటనే మెదడులో డొపమైన్, నోర్పైన్ఫ్రైన్ అనే హ్యాపీ హార్మోన్స్ విడుదలవుతాయి. ఇవి మీ ఒత్తిడిని, డిప్రెషన్‌ను క్షణాల్లో దూరం చేస్తాయి
బ్లాక్ కాఫీ తాగడం వల్ల మీ బాడీ మెటబాలిజం రేటు 3% నుండి 11% వరకు పెరుగుతుంది. ఇది శరీరంలోని కొవ్వును (Fat) వేగంగా కరిగించడానికి సహాయపడుతుంది.
జిమ్‌కి లేదా రన్నింగ్‌కి వెళ్లే ముందు కాఫీ తాగితే శరీరంలో అడ్రినలిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మీ ఫిజికల్ పర్ఫార్మెన్స్ను గణనీయంగా మెరుగుపరుస్తుంది.
రోజుకు 1-2 కప్పుల కాఫీ తాగే వారిలో ఫ్యాటీ లివర్, లివర్ సిరోసిస్ వంటి ప్రమాదకరమైన కాలేయ వ్యాధులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
చక్కెర లేకుండా బ్లాక్ కాఫీ క్రమం తప్పకుండా తాగడం వల్ల.. భవిష్యత్తులో టైప్-2 డయాబెటిస్ (మధుమేహం) వచ్చే ప్రమాదం తగ్గుతుంది
మనం తినే సాధారణ ఆహారం కంటే కాఫీలోనే అత్యధికంగా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీర కణాల నష్టాన్ని నివారించి, మిమ్మల్ని యంగ్‌గా ఉంచుతాయి.
పరిమితంగా కాఫీ తాగడం వల్ల గుండె పనితీరు మెరుగవుతుంది. అలాగే స్ట్రోక్ (పక్షవాతం) వచ్చే అవకాశాలు తగ్గుతాయని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.
ఏదైనా పరిమితికి మించితే ముప్పే! రోజుకు 2 నుండి 3 కప్పుల కాఫీ ఆరోగ్యానికి చాలా మంచిది. అంతకంటే ఎక్కువ తాగితే నిద్రలేమి (Insomnia), అసిడిటీ, కంగారు వంటి సమస్యలు రావచ్చు.